ఎం.ఎస్.సుబ్బలక్ష్మి;- అచ్యుతుని రాజ్యశ్రీ
 శుభలక్ష్మి సంగీత లక్ష్మి
మీరాబాయిగా నటించి
కళానిధి గా వెలిగే
వేంకటేశ్వర సుప్రభాతం తో 
ప్రతి ఇంటా ఆమె గళం నినదించు
కంచిపట్టు చీరెలో వజ్రాల దిద్దులు ముక్కు పుడకలు
ధగధగా మెరియగా
ఉదయభాస్కరబింబం బొట్టు
కాటుక దిద్దిన అరమోడ్పు కనులతో
మీరా భజనలు వైష్ణవ జనతో గానంతో ఐ.కా.స.లో చరిత్ర సృష్టించే
కంచి పరమాచార్య ఆశీస్సులు పొందిన ఆమె భారతరత్న
సంగీతలక్ష్మి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి

కామెంట్‌లు