కలం స్నేహం సభ్యుల సమావేశం
 కలం స్నేహం   అనుబంధ సంస్థల వ్యవస్థాపకులు శ్రీమాన్ గోపాల్ ఆచార్య గారి పుట్టిన రోజు 16/12/23 తేదీన ఎంతో వైభవంగా మియాపూర్ సెవెన్ హిల్స్ రెస్టారెంట్లో జరిగాయి.సంగీత సాహిత్య సేవా సంస్థ అయిన కలం స్నేహం ఎన్నో సాహిత్య సేవా సామాజిక కార్యక్రమాలు చేయడంలో ముందు ఉంటున్నది.కలం స్నేహం సంస్థల జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాధా కుసుమ, రాధిక కానుగు,సరళ కొండన్ ,నోరి మూర్తి,నోరి హేమ కళ్యాణి,విద్యుల్లత , ఝాన్సీ విజయలక్ష్మి ఇంకా అనేక మంది కలం స్నేహం సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా సంబరంగా నిర్వహించారు.కలం స్నేహం నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందుకు 
తన వెంట ఉండి నడుస్తున్న కలం స్నేహం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు వ్యవస్థాపకులు గోపాల్ గారు.

కామెంట్‌లు