కోరాడ అష్ట అక్షర గీతాలు
ఉన్నది వెగటెపుడూ
  లేనిది కావాలంటర
   తృప్తి లేని మనిషి రా
  తెలుసు కోర కోరాడ..!

అష్ట అక్షరము లవి
  క్షరము కాని పదాలు
  నిక్షిప్తము చేయా లిర
  తెలుసు కోరా కోరాడ..!

శ0కర ప్రియ పదాలు
 సత్య మైన పలుకులు
  ఆచ రించ దగ్గ వవి
 తెలుసుకోర కోరాడ..!

నిజము నిష్టు రమ్మురా
 విచ్ఛకమే మెచ్చునురా
  పాపము పిడుగే కద
  తెలుసుకోర కోరాడ..!

చెడును నీవు వీడరా
మంచి తోనె కూడాలిర
 చెడుతో చెరుపే గారా
  తెలుసు కోరా కోరాడ..!
      ******

కామెంట్‌లు