ఆయుధం- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
 రాముని బాణం, కృష్ణుని చక్రం,
శివుని శూలం, హన్మాన్ గద
ఇవన్నీ దుఃఖాన్ని పోగొట్టేవే!
అభయాన్ని ప్రసాదించేవే!
అతి అయిన దుఃఖాన్ని 
హననం చేసేది ఆయుధమే! 
దుఃఖం కడుపుననే 
ఆయుధం పురుడు పోసుకుంటుంది 
ఆయుధం ప్రజాహితం
ధర్మానికి పర్యాయపదం 
ఆయుధానికి అంతం లేదు
రూపుమార్చుకున్న ఆయుధం 
నేడు ఆలోచనగా మారింది 
ప్రపంచపు సకలాణ్వాయుధాలకు సైతం
ధిక్కార స్వరం వినిపిస్తోంది 
ఆలోచనకు కాలనియమం లేదు 
ఆలోచనకు అంతం లేదు 
బడబాగ్నిని కడుపులో దాచుకుంది 
కనుకనే అవసరమైనప్పుడల్లా
అవిశ్రాంతంగా 
ఆర్ణవాగ్నిని వెదజల్లుతూనే ఉంది 
నిర్నిద్రగానం చేస్తూనే ఉంది 
ఇక భయం లేదు 
ప్రపంచపటంలో సైతం 
భారతాన్ని తాకే ధైర్యం లేదెవరికీ!!
**************************************

కామెంట్‌లు