అద్భుతాలు! అచ్యుతుని రాజ్యశ్రీ
 మనదేశంలో కొన్ని అద్భుత ప్రదేశాలు ఉన్నాయి.గోవాలోని నేత్రావళి అనే పల్లెలో బబ్లింగ్ అనే చెరువుంది.దీనిలో గ్రానైట్ బండల్ని వాడారు.దీనిలోని నీటిలో ఎప్పుడూ బుడగలు తేలుతూ బుడబుడలాడుతుంటాయి.ఇక్కడో చిన్న ఆలయం కూడా ఉంది.ఈబబ్లింగ్ లేక్ లో లెక్కలేనన్ని చేపలు తృళ్ళి తృళ్ళి కేరింతలు కొడతాయి.మనం అందులో కాళ్ళు వేలాడేసి పాదాలు నీటిలో పెడితే అవి ఎంచక్కా మన పాదాల మృతకణాలను నాకుతూ శుభ్రం చేసి పెడిక్యూర్ చేస్తాయి.ఇది నేత్రావళి వైల్డ్ లైఫ్ శాంక్చరీ ఉంది.దగ్గరలో కుశావతీనది ఒడ్డున ఆదిమ మానవులు గీసిన జ్యామెట్రీ చిత్రాలు 4000_6000 సంవత్సరాల క్రితం వి కన్పడ్తాయి.మనిషి ఆవు మొదలైన ఆకారాలు బండలపై చెక్క బడినాయి..
మధ్యప్రదేశ్ లో ఎన్నో బండలు గుహలు న్నాయి.ఇలాంటివే అమెరికా లో ఉటాలోనిబ్రైస్ కెన్యాన్ నా చూడటానికి లక్షలాదిమంది వస్తారు.
మన దేశంలో మధ్యప్రదేశ్ లోని ఈప్రాంతంపేరు భీమ్ బేట్ కా! ఈప్రాంతంలో పాండవుల్లో బలశాలి భీముడు ఉన్నాడని అక్కడి గుహల్లో కొన్నాళ్ళు నివసించాడని ఆపేరు వచ్చింది.25కి.మీ.దూరంలో భోజ్ పుర్ ఉంది.మనదేశంలోకెల్లా అతిపెద్ద శివలింగం ఉంది.760 బండల్లో 500 బండలపై పెయింటింగ్స్ వేసి ఉన్నాయి.కానీ సూర్య కిరణాలు నేరుగా వాటిపై పడితేనే అవి కన్పడ్తాయి.మనదేశంలోని వివిధ రాష్ట్రాల కి వెళ్లితే చాలు.విదేశాలకు పరుగులు పెట్టనవసరంలేదు.🌹

కామెంట్‌లు