వోని పాఠశాలను సందర్శించిన పర్యవేక్షక బృందం

 మండల విద్యా శాఖాధికారి కురిటి సోంబాబుతో కూడిన ఐదుగురు పర్యవేక్షక బృంద సభ్యులు వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. 
పాఠశాల అసెంబ్లీ సమయానికే వచ్చి, ఉదయం పూటంతా పర్యవేక్షణ జరిపి అనంతరం ఉపాధ్యాయులతో సమీక్షించారు. 
పర్యవేక్షక బృంద సభ్యులు 
మండల విద్యా శాఖాధికారి కురిటి సోంబాబు, సి.హెచ్.సోమేశ్వరరావు, బి.సంగంనాయుడు, ఎన్.అరుణ్ కుమార్, బౌరోతు మల్లేశ్వరరావులు
తాము చేపట్టిన తనిఖీలో అంశాలను ఉపాధ్యాయులతో సమీక్షించారు.
ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి, ఉపాధ్యాయులు పాలవలస శారదాకుమారి, గోగుల సూర్యనారాయణ, దానేటి పుష్పలత, సిద్ధాబత్తుల వెంకటరమణ, కుదమ తిరుమలరావులు సూచనలను, సమీక్ష అంశాలను విని పూర్తి అవగాహన పొందారు. 
పాఠశాల పనితీరుపట్ల తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, మరింత అభివృద్ధికై తగు ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. 
ఏడాది కాలంగా రాష్ట్ర విద్యా సంచాలకులు విడుదల చేసిన ఎపిసోడ్స్ ను విని ఆచరించాలని అన్నారు. విద్యార్ధులు వ్రాస్తున్న నోట్ బుక్స్, వర్క్ బుక్స్ లోని తప్పొప్పులను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. 
తప్పిదం గుర్తిస్తే, ఆ చోట సరైన పదాన్ని రాయాలని అన్నారు. 
ప్రోజెక్ట్ వర్క్స్ పట్ల శ్రద్ధ వహించి విద్యార్థులలో పరిశీలనా దృక్పథం, సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందించేలా కృషి చేయాలని అన్నారు. 
ఉపాధ్యాయుల పాఠ్యపథక రచన, టీచర్ డైరీ, టీచింగ్ నోట్స్, తర్ల్, లిప్ రికార్డులను పరిశీలించారు.
తొలుత అన్ని తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల పుస్తకాలను పరిశీలించారు. 
వారి ప్రతిభను పరీక్షిస్తూ ప్రశ్నించారు. పాఠశాల రికార్డులను పరిశీలించి, వివరాలను నమోదు చేసుకున్నారు.
కామెంట్‌లు