🌻15వ,పాశురము🌻
ఎల్లే యిలంగిళియే ! యిన్నమురంగుడియో ?
శిల్లే నఖై యేన్మిన్? నట్లైమీర్, పోదురు గిన్రే న్ వల్లై
ఉన్ కట్టురై గళ్ పణయున్ వాయఱిదుమ్
వల్లీర్లళ్ ,నీజ్ఞతే , నానేదానాయుడుగ ఒల్లనీ
పోదాయె ,ఉనక్కెన్న వేఱుడైయై? ఎల్లారుమ్
పోన్టారో ? పోన్టారో , పోన్ణెణ్ణిక్కోళ్ వల్లానై కొన్రానై
మత్తారై మాత్తళిక్క వల్లానై మాయవై ప్పాడేలో
రెమ్బావాయ్
ఈ మాలిక సంభాషణ రూపంలో ఉన్నది బయటివారు_, ఓ లేత చిలుకా! ఇంకనూ నిద్రిస్తున్నావా? ఇదేమి ఆశ్చర్యమే!
లోపలి గోపాంగన_పూర్ణులైన పూ బోడులారా!
ఇదిగో వస్తున్నాను
బయటివారు_శీఘ్రముగా రావమ్మా !
లోపలి గోపాంగన_అబ్బా! గొల్లుమని ఉలికి బడినట్లు గొంతు ఎత్తి చెవులు గడియలు పడునట్లు పిలవకండి వస్తాలే"
బయటివారు_ఓ చిన్ని చిలుకా! నీవు చాలా చమత్కారముగా మాట్లాడతావు లే"!
నీ నేర్పరితనం నీ పుల్లవిరుపు మాటలు, మేము ఇదివరకే ఎరుగుదుము లేమ్మా!
లోపలి గోపాంగన,_ మీరే అట్టి సమర్ధులమ్మా!
నేనేమీ కాదులే! అయినా మీరన్నట్లు నేనట్టిదాననేమో ! రావాలిసిన వారందరూ వచ్చిరా?
బయటివారు_ఆ!అందరూ వచ్చి చేరారు.నీవే వచ్చి
లెక్క జూడ వచ్చుకదా !
బయటివారు_కువలయపీడమనే కంసుని గజమును,కంసాది శత్రువులను సంహరించిన
సర్వేశ్వరుడైన శ్రీ కృష్ణ ని కల్యాణ గుణములను ,
కీర్తింపగా రమ్ము ఇట్లు చేసిన గాని మనము చేయువ్రతము శుభప్రదముగ పూర్తి కాదని బయటినుంచి సమాధానం చెప్పి ఆమెను కూడా తమ గోష్టిలో నకి చేర్చుకున్నారు
🪷****🪷****🪷
తిరుప్పావై;- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి