సామాజిక భాగస్వామ్యంతోనే పాఠశాల ప్రగతి

 సమాజ భాగస్వామ్యంతోనే పాఠశాల అభివృద్ధి సాధ్యపడునని వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి అన్నారు. 
ప్రభుత్వ నిర్దేశాల మేరకు నేడు పాఠశాలలో నిర్వహించిన పేరెంట్ టీచర్ అసోసియేషన్ మరియు పేరెంట్స్ కమిటీ సమావేశానికి వారు అధ్యక్షత వహించారు. 
ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ నిర్మాణాత్మక మూల్యాంకనాల అనంతరం గత రెండు నెలల్లో విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులకు తెలియపరచడం జరిగిందని, నేడు సంగ్రహణాత్మక మూల్యాంకనం ఫలితాలను నివేదించుటకై ఈ సమావేశం నిర్వహించామని, తమ పిల్లల విద్యా స్థాయి స్థితిగతులను నేరుగా తల్లిదండ్రులతోనే చర్చించుటకు ఇట్టి సమావేశాలు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. 
తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ వూయక చిన్నయ్య మాట్లాడుతూ 
పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా తమ వంతు సహకారాన్ని అందజేస్తామని అన్నారు. అనంతరం ఈ వేదికపై విద్యార్థుల ప్రగతి పత్రాలను వారి తల్లిదండ్రులకు అందజేశారు. 
ఉపాధ్యాయని పాలవలస శారదాకుమారి మాట్లాడుతూ 
విద్యార్థుల్లో చదువుల పట్ల మరింత ఆసక్తి పెరిగేలా తమతోపాటు తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు మిక్కిలి శ్రద్ధ వహించాలని అన్నారు. ఉపాధ్యాయులు గోగుల సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో నూతనంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ప్రవేశపెట్టిన విద్యాపథకాలన్నీ సక్రమంగా అమలుచేసే దిశగా మనమంతా మరింత కృషి చేయాలని అన్నారు. ఉపాధ్యాయని దానేటి పుష్పలత మాట్లాడుతూ ముఖ్యంగా వర్క్ బుక్స్, నోట్ బుక్స్ పిల్లలంతా ఏమేరకు నమోదు చేస్తున్నారో ఇంటి వద్ద తల్లిదండ్రులంతా తగు శ్రద్ధ వహించాలని అన్నారు. 
ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు క్రమశిక్షణతో మెలిగేలా చూడాలని,  పెందలకడనే నిద్రలేచేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అన్నారు. 
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బలగ నాగమణి, ఉపాధ్యాయులు పాలవలస శారదాకుమారి, గోగుల సూర్యనారాయణ, దానేటి పుష్పలత, కుదమ తిరుమలరావు, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ వూయక చిన్నయ్య, వైస్ చైర్మన్ కనపాక పుణ్యవతి, కమిటీ సభ్యులు వి.పార్వతి, 
ఎం.ఉమామహేశ్వరరావు, బి.లక్ష్మునాయుడు, ఇ.సుజాత, 
కె.లలిత, తల్లిదండ్రులు 
టి.రమణమ్మ, బి.పద్మ, కె.రామలక్ష్మి, ఎన్.గౌరీశ్వరి, 
కోట లలిత తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు