సాహితీవనం;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
సాహితీవనము
వెలుగుతుంది
కవితాకాంతులు
చిందుతుంది

సాహితీవనము
పిలుస్తుంది
అక్షరాలు
పలుకరిస్తున్నాయి

సాహితీవనము
ప్రవహిస్తుంది
పదాలు
పరవళ్ళుతొక్కుతున్నాయి

సాహితీవనము
గుబాళిస్తుంది
కైతాపరిమళాలు
వ్యాపిస్తున్నాయి

సాహితీవనము
గళమెత్తుతుంది
కవనగేయాలు
కర్ణాలకింపునిస్తున్నాయి

సాహితీవనము
సందడిచేస్తుంది
పలుప్రక్రియలను
పరిచయంచేస్తుంది

సాహితీవనము
అందాలనుచూపుతుంది
పరికించువారలకు
ఆనందాలనందిస్తుంది

సాహితీవనము
నవ్వుతుంది
మోములను
వెలిగిస్తుంది

సాహితీవనము
వృద్ధిచెందుతుంది
అంతరంగాలను
ఆకర్షిస్తుంది

సాహితీవనము
చిగురిస్తుంది
నవకవితలను
ముందుకుతెస్తుంది

సాహితీవనము
చదవమంటుంది
ఆలోచనలను
తట్టిలేపుతుంది

సాహిత్యరసమును
క్రోలండి
సాహిత్యజలమునందు
మునగండి


కామెంట్‌లు