మహాzనల లింగమూర్తి దర్శనము;-"కవి మిత్ర" శంకర ప్రియ., శీల.,-సంచార వాణి:- 99127 67098
 🔱ఆదియు అంతము లేని
     మహాzనల లింగమందు
      ప్రాదుర్భవించిన స్వామి!
      ఆది దేవ! నమః శివ!
           (అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
  ⚜️పరమ శివుడు.. కరుణా సాగరుడు! భక్తపరాధీనుఁడు! కావున, హరిబ్రహ్మలకు సాధ్యము గాని; స్వామి దివ్యదర్శనము భక్తులకు అనుగ్రహించు చున్నాడు! 
     శ్రీమన్మహాలింగేశ్వర స్వామివారి పాద దర్శనమునకై... పందిరూపమును దాల్చి విష్ణువు; శిరోదర్శనము నకై.. హంసరూపము దాల్చి విధాతయు.. తిర్యగ్జంతువులుగా మారారు! వారిరువురు.. భూమి, అంతరిక్షము లందు.. తిరిగి తిరిగి వేసారి పోయారు! కాని, జ్యోతిర్లింగ లింగమూర్తి యొక్క ఆదియు.. అంతమును (మొదలును, చివరను) కనుగొనలేక పోయారు! వారికి దురహంకారం తొలగి పోయింది! జ్ఞానోపదేశం కలిగింది! సాంబశివుని పూజాతత్పరులైనారు! 
 🔱ఓ శంకర భగవాన్! స్వామి! మీరు మాయెదుట ప్రసన్నులై; శివతత్త్వ జ్ఞానము, స్వామి దర్శనము.. మాకెట్లు తెలియనగునో శెలవివ్వండి! అని,వినయ విధేయతలతో ప్రార్థించు చున్నారు! శంకర భగవత్పాదులవారు!
 🙏ప్రార్థనా శ్లోకము
     ఇదం తే యుక్తం వా పరమశివ! కారుణ్య జలధే! 
     గతౌ తిర్యగ్రూపం తవ పద శిరో దర్శన ధియా 
    హరి బ్రహ్మానౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ 
     కథం శంభో! స్వామిన్! కథయ మమ వేద్యోసి పురతః!
        (శ్రీ శివానంద లహరి., 99.వ. శ్లోకము.,) 
            🪷🔆🪷
       🚩చంపక మాల పద్యము
      పరమ శివా! దయాంబునిధి! భవ్యము నీ నిజమూర్తి నారయన్
    హరి కిటియై, సరోజజుడు హoసగ దాల్చి, భువిన్ దివిన్ చరిం
     పరె మును? వారి యత్నములు వ్యర్థములే! భవ! నాకు నెట్లు నీ
      యరుదగు దివ్యదర్శన మహాసుఖ మబ్బు? ఉమా మహేశ్వరా! 
       (రచన:- *శ్రీకార్యంపూడి రాజమన్నారు.,)
             🪷🔆🪷
      🚩 ఉత్పల మాల పద్యం
     కానగ లేకపోయె నిను, కామన పక్షిగ బ్రహ్మ శీర్షమున్
     కానగ లేకపోయె హరి, కామ్యద పాదము తా వరాహమై;
     కానగ రాకపోవుటకు, కారణమెద్ది మహేశ! యుక్తమా?
      కానగ నిన్నుపాయమును, కాదనకుండగ చెప్పుమా! శివా!
            ( రచన:- డా. "శ్రీపాదుక" కొల్లూరు అవతార శర్మ.,)
🕉 నమః శివాయై నమః శివాయ!
     (శ్రీశివ ఏకాదశాక్షరి (11).. తారక మహా మంత్రము.,)

కామెంట్‌లు