పక‌్షుల ప్రేమ - దరావత్ శ్రావణిక-ఏడవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-7036277957
 అనగనగా రామారం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో రమ్య అనే  అమ్మాయి ఉండేది. రమ్యకి పక్షులు, జంతువులు అంటే చాలా ఇష్టం. పక్షులు ఎలాంటి ఆపదలో ఉన్న సహాయం చేసేది. అందువల్ల పక్షులన్నీ రమ్య ఇంటి చుట్టే తిరుగుతుండేవి. రమ్యకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడం మూలంగా ఒంటరిగా ఇంట్లోనే ఉండసాగింది. తల్లిదండ్రులు లేకపోవడం మూలంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించేది. అయినా పక్షులపై ప్రేమ కనబరుస్తూనే ఉండేది. రమ్యకు అయినవారు ఎవ్వరు లేకపోయినా రమ్య పక్షులపై ప్రేమ చూపడం చూసి జనం ఆశ్చర్యపోయేవారు.
           రమ్యది చాలా స్వచ్ఛమైన మనసు. ఒకరోజు దారిలో రమ్య వెళుతుండగా ఎవరిదో ఆపదలో ఉన్న గొంతు వినబడింది. రమ్య పరుగున ఆవైపు వెళ్లి చూసింది. ఒక వ్యక్తి బైక్ పైనుంచి కింద పడి గాయాలతో ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఎవ్వరు మనుషులు లేరు. రమ్య ఒక్కతే సహాయం చేసే పరిస్థితిలో లేదు. రమ్యకు ఏం చేయాలో తోయలేదు. ఒక్కసారిగా రమ్య బిగ్గరగా అరిచింది. రమ్య అరుపు విన్న పక్షులన్నీ రమ్య ఉన్న ప్రాంతానికి వచ్చి, చుట్టూ తిరుగుతూ గట్టిగా అరవసాగాయి.
              పక్షులు అలా ఒకే దగ్గర అరవడం విన్న ప్రజలంతా అక్కడికి వచ్చారు. ఆపదలో ఉన్న వ్యక్తిని చూసి తొందరగా ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు వైద్యం చేసి, వ్యక్తికి ఆపద  తప్పిందని సరైన సమయంలో తొందరగా తీసుకొచ్చారని అన్నాడు. ప్రజలంతా తిరిగి పనులకు వెళ్లారు. రమ్య తన స్నేహితులైన పక్షుల అరుపు ద్వారా తనను రక్షించిందని తెలుసుకున్న ఆపదలో నుంచి బయటపడిన వ్యక్తి రమ్యకు తగిన వసతులు కల్పించి చదివించసాగాడు. రమ్య బాగా చదువుకొని పెద్ద ఉద్యోగంలో చేరింది. అలాగే పక్షుల పెంపకం మరియు వాటిని ఆపద నుంచి రక్షించడం మాత్రం మానలేదు.


కామెంట్‌లు