పావురం చిక్కు- సన- ఎనిమిదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9311244843
  అనగనగా రామాపురం అనే ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. రామయ్య, అనిత దంపతులకు సంహిత, రీతు ఇద్దరు పిల్లలు ఉండేవారు. అందరూ కలిసి ఆనందంగా జీవించేవారు. తల్లిదండ్రులు కూలీపనులు చేస్తూ జీవించేవారు. పిల్లలిద్దరూ బడికి వెళ్లేవారు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వస్తుంటే దారిలో ఒక పావురం కాళ్లకు దారం చుట్టుకుని ఉన్నది. పావురం ఎంత గింజుకున్నా దారం చిక్కు మాత్రం పోవడం లేదు. పావురం కాలుకు గాయమై రక్తం కారసాగింది. 
         ఇద్దరూ కలిసి పావురం కాళ్లకు ఉన్న దారం తీయడానికి ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా చిక్కు మాత్రం పోవడం లేదు. చివరకు ఎలాగో ఒకలాగా దారాన్ని తీసివేశారు. కానీ గాయంతో పావురం ఎగర లేకపోయింది. గాయమైన ప్రాంతంలో పావురానికి కట్టుకట్టి, తమ ఇంటికి తీసుకువెళ్లారు. సంహిత, రీతులు పావురాన్ని చూసి, చాలా సంతోషించారు. రెండు రోజులపాటు పావురాన్ని చిన్న పిల్లలు జాగ్రత్తగా చూసుకుని, దానికి విత్తులతో భోజనం కూడా పెట్టారు. తర్వాత పావురం తన గూడుకు వెళ్ళింది. పావురం అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి సంహిత, రీతులతో పక్షి భాషలో మాట్లాడుతూ ఎగిరి వెళ్ళేది. పావురం వచ్చినప్పుడల్లా అందరూ సంతోషించేవారు.
నీతి; ఆపదలో ఉన్న ఎవరినైనా రక్షించాలి. అప్పుడే మనసు సంతోషంగా ఉంటుంది.





కామెంట్‌లు