బాలిక ; డి వినాయక్ రావు బైంసా . ;-440749686
జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగ పద్యాలు 
=======================================
1.కం:జననీ జనకులు ధన్యం
జననము నియ్యంగ నాడ జాతి శిశువుకున్
తనమది గొప్పది నాడన్
ఘనముగ పంచంగ ప్రేమ కర్వరి ప్రతిగన్

2.కం:బాలిక బాగోగులనున్
పాలకులు శ్రద్ధతోని పట్టించుకునన్
మేలగు స్త్రీ జాతి కదియు
మేలిమి సంవృద్ధి నొంద మెయిలోనెపుడున్

3.కం:కొండుక కొడుకంటు తలచి
నిండుగ నుత్సాహముండు నిగమంబెంచన్
దండిగ ప్రేమము నుండట
పండును నాయిల్లు సతము బైసుండంగన్కామెంట్‌లు