సుమిత్ర;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 లక్ష్మణునకు ఈ మాత్రం మాట చాలు కానీ రాముడు లక్ష్మణుని వనవాసానికి తోడుకొని వెళ్ళుటకు సమ్మతించనప్పుడు లక్ష్మణుడు ఈ  విషయాల్ని ఉటంకిస్తూ అంటాడు. అన్నయ్య నువ్వు ఇదివరకే అనుమతి ఇచ్చావు మరి ఇప్పుడు ఎందుకు నన్ను వద్దంటున్నావు అన్న లక్ష్మణుని ఈ వివేకపూర్ణ వచనాన్ని చదివినప్పుడు చదువరులు వాల్మీకి మహర్షి లక్ష్మణునికి ఎప్పుడు అనుమతి ఇప్పించాడో అని ఆశ్చర్య పోవాల్సిందే. అనుగమ్యాతాం అన్న ప్రబోధం లక్ష్మణునికే అవగతమవుతుంది. ఇతరులు ఎవరికి  సాధ్యం కాదు కానీ సుమిత్రకు మాత్రం తెలుసు అందుకే సుమిత్ర కూడా అనుమతిని గురించి విశేషంగా ప్రస్తావించకుండా లక్ష్మణునికి అనుమతి ఇచ్చి ఆశీర్వదించింది. నిజానికి కౌసల్య ద్వారా రామునికి లభించే దివ్య ఆశీస్సులు కూడా లక్ష్మణుడికి చెందుతాయి అందుచేత తాలూకా ఘనంగా ఆవశ్యకత లేదని సుమిత్ర భావన. కేవలం 10 పంక్తుల లోనే సుమిత్ర మంగళా శాసన వచనాలను పలుకుతుంది ఆమె అవ్యక్త ప్రేమ భావ మాధుర్యమే ఆమె నయనాల నుంచి జాలువారీ అశ్రువుల్లో రాసీ భూతమై నిలిచింది తన మాటల్ని బాగా పరిమితం చేసుకుంటూ సుమిత్ర పదేపదే గచ్ఛ గచ్చతి అంటూ తన మాటలను ముగించే సమయానికి సుమంతుడు వచ్చి రామునికి నమస్కారం చేశారు. కానీ ఎంతటి పూర్వపర సంబంధాలు ఉన్నాయో కేవలం వాల్మీకి మహర్షి వాగ్ విజ్ఞతకే తెలియాలి సుమిత్ర  శబ్దం మైత్రికి పర్యాయపదం  అందరితో మైత్రి బంధాన్ని కలిగి శత్రువు రహితంగా మానవీయ గుణాన్ని ఆవిష్కరిస్తుంది సూర్య భగవానుని కూడా తన మిత్రుని గానే భావిస్తుంది. సుమిత్ర భగవానుని సర్వవ్యాపకత్వం మిత్రత్వాన్ని ప్రతిబింబించిన సుమంత్రుడు మాత్రం ఆమెను చంద్రునితో ఉపమిస్తూ వెన్నెల మూర్తిగా కొనియాడుతాడు సుమంత్రుని ఈ అభిప్రాయం తెలుసుకున్నప్పుడు మనకు తెలియవచ్చేదేమంటే వాల్మీకి మహర్షి సుమిత్ర యొక్క అదృష్ట సంయోగాన్ని ప్రతిపాదించాడు  లక్ష్మణునికి వీడ్కోలు చెప్పే సమయంలోనే సుమిత్ర నోరు తెరిచింది  తనలో దుఃఖంలో కూడా కౌసల్య దుఃఖాన్ని తొలగించి ఓదార్పు కలిగించే మాటలతో సుమిత్ర ముందుకు వచ్చింది రాముని పట్ల తనకు గల మాతృ ప్రేమ కారణంగా రాముని వీర పరాక్రమ ఔన్నత్యాన్ని మరుగుపరుస్తుంది కానీ సుమిత్రకు అంతా తెలుసు ఆమె అంటుంది.

కామెంట్‌లు