మాతృమూర్తి - సి.హెచ్.ప్రతాప్

 ప్రాణం పోసేది దైవం.. ప్రాణం మోసేది అమ్మ .
 అమృతం లాంటి ప్రేమను చూపేది..
అప్యాయత అనురాగం పంచేది అమ్మ
అమ్మ అన్నపదం అద్భుతం..
అమ్మకి అద్భుతం మన జీవితం
అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే..
మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది.
ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. .
కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు
గర్భాశయంలో పెంచి జన్మనిచ్చిన ప్రేమమూర్తి.
పాలు త్రాగించి, ఆహారం తినిపించి,
ప్రేమతో పెంచుతుంది
కంటికి రెప్పలా కాపాడుతుంది
తల్లిని మించిన ప్రేమమూర్తి
ఈ ప్రపంచంలోనే లేదు
అమ్మ మనసు అమృతమయం
అమ్మ ఒడిలో స్వర్గమే ఉంది
అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే,
అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే
మాటలకు అందని ప్రేమమూర్తి
అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే
కామెంట్‌లు