* కోరాడ తత్వ గీతి *

 కష్టాలను ఎదిరించి........! 
 గీత రచన, స్వరకల్పన , గానం
    కోరాడ నరసింహా రావు..! 
         *****
పల్లవి;-
   కష్టా లను ఎదిరించి... సుఖా లను  విదిలించి... సత్యమును గ్రహించి...సన్మార్గమున నడచి
 ముక్తిని పొందగా పరితపించవె
 మనసా... పరి తపించవే...! 
       "కష్టా లను ఎది రించి... "
చరణం:-
   ఈ మాయామోహితజగతిలో చిక్కుకొని యున్నావు... 
  కష్టములే సుఖములనుభ్రమ లో బ్రతుకు తున్నావు..! 
       " ఈ మాయా మోహిత... "
  అనుభవాని కొచ్చు సరికి... 
  వగచి- వగచి ఏడ్చేవు.... 
  వగచి- వగచి ఏడ్చేవు....! 
       "కష్టా లను ఎది రించి... "
చరణం :-
  నీ నిజగురువును ఆశ్రయించు
   సాధన కొన సాగించు.... 
    అనుకున్నది సాధించు... 
    జీవన్ ముక్తు డ వై.... 2
     ఆనందించవె మనసా... 
         ఆనందించవే...మనసా...
            ఆనం దించవే....!! 
        ********
కామెంట్‌లు