సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత విశేషాలతో కూడిన క్విజ్ పోటీలలో ప్రతిభ చూపిన ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, లక్కోజి శ్రీనివాసరావు, శిష్టి లక్షున్నాయుడులు ప్రశంసాపత్రాలు సాధించారు.
ఈ ముగ్గురికీ సర్దార్ యూనిటీ స్వాభిమాని భారత్ అనే ప్రశంసాపత్రాలను మై గవర్నమెంట్ సీఈవో ఆకాష్ త్రిపాఠి సంతకంతో ధ్రువీకరించి పంపగా స్వీకరించారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ, జీ ట్వంటీ ఇండియా, మై గవర్నమెంట్ లు సంయుక్తంగా అంతర్జాలం ద్వారా నిర్వహించిన ఈ క్విజ్ పోటీలలో ఈ ముగ్గురు ఉపాధ్యాయులూ పాల్గొని సరైన జవాబులను సమాధానపర్చినందుకు జాతీయస్థాయి ప్రశంసాపత్రాలకు ఎంపికయ్యారు.
కుదమ తిరుమలరావు ఓని పాఠశాలలో, లక్కోజి శ్రీనివాసరావు లింగాలవలస పాఠశాలలో, శిష్టి లక్షున్నాయుడు మునకలవలస పాఠశాలలో ఉపాధ్యాయులుగా తమ సేవలను అందజేస్తున్నారు.
వీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత విశేషాలతో కూడిన పోటీలలో పాల్గొని ప్రశంసాపత్రాలు పొందుటపట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి