తిరుమలరావుకు శ్రీరామామృత ప్రశంసాపత్రం


 రాజాం రచయితల వేదిక సభ్యులు,  జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు 
మరో అరుదైన గౌరవాన్ని స్వీకరించారు. 
ఆర్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు కళారత్న పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామామృత కవితోత్సవంనకు కవితలను ఆహ్వానించగా తిరుమలరావు పంపిన శ్రీరామమందిరం అను కవితకు ప్రశంసాపత్రం లభించింది.
అయోధ్యలో శ్రీరామాలయ ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని, హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాలం ద్వారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి జానపద అకాడమీ అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ ఈ కవితోత్సవాన్ని నిర్వహించారు.  తిరుమలరావు పంపిన కవితలో 
మహా విష్ణువు పునర్జన్మ తారకరాముడు, ధర్మాన్ని కాపాడుటకై ఉద్భవించిన భద్రాద్రి రాముడు, రఘువంశానికీ దశరధమహారాజ తనయునిగా ధన్యత చేకూర్చిన అయోధ్యరాముడు, 
శివధనస్సు విరిచిన జానకిరాముడు, మానవత నిల్పిన కోదండరాముడు, లోకకల్యాణానికి కట్టుబడిన కల్యాణరాముడు, ప్రజాసంక్షేమ పాలనతో రఘురాముడు, ప్రతి హృదయం శ్రీరామమందిరమై పరిఢవిల్లు సీతారాముడు అంటూ రచించారు.
తిరుమలరావుకు శ్రీరామామృత ప్రశంసాపత్రం లభించుటపట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు