నమ్మకు;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 సీతాకోక చిలుకమ్మా
త్వరగా ఎగిరీ పోవమ్మా
మనుషులనూ నువ్వు నమ్మకమ్మా
నమ్మించి చంపుతారు పోవమ్మా

కలికి కన్నుల అందమంతా
పుణికిపుచ్చుకున్న ఓ కమలా
కొలను దాటి రావద్దూ
లక్ష్మణరేఖ దాటొద్దూ
అందం వయసూ దోచుకునీ
చెత్తలోకి నిన్ను తోస్తారు
దేవుని నమ్మితె సుఖముందీ
మనిషిని నమ్మితె దుఃఖముందీ!!
**************************************


కామెంట్‌లు