హరీ!'శతకపద్యాలు.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 13.
ఉత్పలమాల.
రక్షణ గోరినిన్ సురలు లావును పొందిరి భాగ్యవంతులై
సాక్షిగ వెల్గుచున్ జగతిఁ జక్కగ పాలన జేయువాడ!నే 
దీక్షను బట్టినిన్ గొలుతు దేవిడి యొద్ద విధేయురాలనై
యక్షరమూర్తి!నీ దరికి నాశ్రయ మొందగ జేరితిన్ హరీ!//
14.
ఉత్పలమాల.
శక్తినొసంగు వేల్పువని సాధన జేయుచు యోగులెల్లర
వ్యక్తుడవైన నిన్ను గన బారులు తీరగ నీదు సన్నిధిన్
భక్తపరాత్పరుండవట!వాంఛలు తీర్చిన గాథవింటి సం
రక్తిగ పూజలన్ సలిపి ప్రాపును బొందెద నమ్మికన్ హరీ!//

కామెంట్‌లు