హరీ!'శతకపద్యాలు.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే మహారాష్ట్ర.
 1.
ఉత్పలమాల.
శ్రీలలనామణిన్ గలిసి శ్రీగిరిపై కొలువుండి ధారుణిన్
బాలన జేయు నిన్ను గన భక్తిగ పర్వులు పెట్టి వచ్చుచ్చున్
గాలము విస్మరింతుమయ!కైటభహారి!సదా ప్రసన్నతన్
మాలిమి జూపి మా కిడుమ మంగళమైన విభూతులన్ హరీ!//

2.
చంపకమాల.
హరి!హరి!'యంచు బిల్వ కరి యార్తిని బాపగ వచ్చినాడవే
నిరతము దల్చు ద్రౌపదికి నిండుగ నిచ్చితె చీరసారెలున్
గురుతుగ పక్షిరాజు కిడి కొల్వున సేవను బ్రీతిమీరగన్
మరినను విస్మరించితివి మర్మము దెల్పుము వేగమే హరీ!//

కామెంట్‌లు