జోన్-2 గ్రిగ్స్ పోటీ విజేతలకు అభినందన

 టెక్కలి జెడ్పీ హైస్కూల్ లో ఇటీవల టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల స్థాయి గ్రిగ్స్ మీట్ అంతర పాఠశాలల స్థాయి పోటీలలో పాల్గొని విజయ ఢంకా మోగించిన కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులను, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అభినందించారు. కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలలో రాణించినచో మానసిక, శారీరక వికాసం సాధించగలరని అన్నారు.
వ్యాయామ ఉపాధ్యాయులు జన్ని చిన్నయ్య మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలను, పోటీతత్వాన్ని, స్నేహభావాల్ని, క్రమశిక్షణలను ఈ ఆటలాడే ప్రక్రియనందు అలవర్చుకోవచ్చునని అన్నారు. హాజరైన 9 మండలాల బాలబాలికలకు వేర్వేరుగా  సీనియర్స్, జూనియర్స్ విభాగాలలో పాల్గొని గెలుపొందిన ఈ పాఠశాల విద్యార్థులు 20 మందికీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, మరియు ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. బాలికల విభాగంలో వాలీబాల్, కబడి, బ్యాడ్మింటన్ మూడు విభాగాలందునా ఈ పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థాయిని సాధించారు. 100 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ ద్వితీయ స్థానాల్లో బి.హిమబిందు, వి.లహరి,  
లాంగ్ జంప్ పోటీలలో ద్వితీయ విజేతగా బి.హిమబిందు, షార్ట్ ఫుట్ పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో బి.హిమబిందు 
కె.సోనియాలు, డిస్క్ త్రో పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో  బి.సుస్మిత, బి.పూజలు, 4x100 రిలే పరుగు పోటీలలో ప్రథమ స్థానంలో బి.హిమబిందులు గెలుచుకున్నారు. జూనియర్ బాలుర విభాగంలో 1500 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ విజేతగా కె.చందు, 4x100 రిలే పరుగు పందెంలో తృతీయ స్థానంలో బి.అభి, హేమంత్, దేవా, ధనుంజయలు గెలుపొందారు. సీనియర్స్ బాలుర విభాగంలో షాట్ పుట్ పోటీలలో ప్రథమ విజేతగా వి.కరుణాకర్, నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో ప్రథమ విజేతగా వి.కరుణాకర్, జావిలిన్ త్రో పోటీలలో ద్వితీయ విజేతగా  వి.కరుణాకర్, బాలికల జూనియర్ నాలుగు వందల మీటర్ల పరుగు పందెం విభాగంలో కె.సోనియా ద్వితీయ స్థానంలో, డిస్క్ త్రో పోటీలలో ద్వితీయ విజేతగా వి.కరుణాకర్, 1500 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానాన్ని ఎల్.తరుణ్ లు గెలుపొందారు. 
మిక్కిలి చిత్తశుద్ధితో కూడిన కఠోర సాధన చేసి విజేతలుగా నిలిచిన వీరంతా పాఠశాలకు గర్వకారణంగా నిలిచారని ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, వ్యాయామ ఉపాధ్యాయులు జన్ని చిన్నయ్య, మరియు ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బంది కొనియాడారు. ఇండివిడ్యువల్ చాంపియన్ షిప్ ను ఈ పాఠశాల విద్యార్థిణి బి.హిమబిందు సాధించడం, ఆల్ రౌండ్ చాంపియన్ షిప్ ను కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాధించడం టెక్కలి డివిజన్ కే గర్వకారణమని పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ బూరాడ రమేష్, వైస్ చైర్మన్ భూపతి లక్ష్మి తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
ఈ అభినందన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, వై.నరేంద్ర కుమార్, రవికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణ పాల్గొన్నారు.
కామెంట్‌లు