వీళ్లు చాలా గ్రేట్.. ఒకేసారి 4 ఉద్యోగాలు సంపాదించారు

 వరంగల్ కు  చెందిన ఇద్దరు మహిళలు ఒకేసారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఖిలా వరంగల్ కు చెందిన హిమబిందు, గీసుకొండ మండలం ధర్మారానికి చెందిన కొప్పుల చైతన్య వరుసకు అక్కాచెల్లెళ్లు. కష్టపడి చదివి ఉద్యోగ పోటీ పరీక్షలు రాశారు. ఇద్దరూ ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాల్లో ప్రతిభ కనబరిచి చెరో 4 ఉద్యోగాలు సాధించారు. ఇటీవల ప్రకటించిన గురుకుల బోర్డు ఫలితాల్లో వారు డిగ్రీ, జూనియర్, స్కూల్ మూడు విభాగాల్లో ఎంపికయ్యారు. తాజాగా ఈ నెల 16న ప్రకటించిన పాలిటెక్నిక్, సాంకేతిక విద్య ఫలితాల్లో హిమబిందు మహిళా విభాగంలో రాష్ట్రంలోనే సెకండ్ ర్యాంకు సాధించగా, చైతన్య మొదటి ర్యాంకు సాధించింది. వీరు నాలుగు ఉద్యోగాలు సాధించినప్పటికీ .. చివరికి అసిస్టెంట్ ప్రొఫెసర్ (డిగ్రీ లెక్చరర్) పోస్టును ఎంచుకున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే హైదరాబాద్ లో నియామక పత్రాలు అందుకున్నారు. హిమబిందు ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించే గురుకుల విద్యాలయానికి ఎంపిక కాగా , చైతన్య బీసీ సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహించే మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయానికి ఎంపికైంది.
కామెంట్‌లు