బ్రహ్మజ్ఞాని;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 జంజ ధారణ  అన్న విషయాల్లో కూడా మనకు అర్థం కాని  సనాతన ధర్మం దానిలో ఇమిడి ఉంది. బ్రాహ్మణులు వేసే జంధ్యం వేరు  బ్రాహ్మణులలో కూడా పుట్టినప్పుడు పెరుగుతున్నప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రచారకుడిగా ఉన్నప్పుడు  వేసే జంజం వేరు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించిన నిజమైన బ్రాహ్మణునిగా వేద కర్మలను నిర్వహించడానికి అర్హత పొందిన వారు వేసే జంజం వేరుగా ఉంటుంది  వీరికి భిన్నంగా యజ్ఞ యాగ క్రతువులు చేసే  ఈ యాజ్ఞకులు ధరించే  జంజం వేడిగా ఉంటుంది  క్షత్రియుడు వేసే జంధ్యం వైశ్యులు వేసే ధారణ వేరువేరుగా ఉంటాయి దానిని చూసి వారు ఎవరో మనం గుర్తించవచ్చు  భారతీయులలో ఉన్న గొప్ప సంప్రదాయం  వ్యక్తిని చూడగానే అతను ఎవరు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలగడం  ముండార్ధ ముండ గోష్పాదములు భారతీయతా చిహ్నములు అని మన వేదాంతులు చెబుతారు  విద్యార్థిగా తన అక్షరాభ్యాసాన్ని కొనసాగించడానికి వెళ్లే ప్రతి కురవాడికి బోడి గుండు కూడా చేస్తారు వారిని ముండలు అని పిలుస్తారు ముండ అంటే ముండనము చేయించుకున్న వాడు  భర్త చనిపోయిన స్త్రీ  కూడా ముండా అనే సంప్రదాయం ఉన్నది ఇంతకుముందు  దానికి కారణం ఆయన చనిపోగానే ఆమె జుట్టును తీసివేసే పద్ధతిని అమలు చేశాడు కనుక ఆమెను కూడా అలాగే పిలిచేవారు. గురువుగారి దగ్గర ఉచితంగా విద్య నేర్చుకున్న ఈ కుర్రవాడు  విద్య పూర్తిగా గాని అర్థముండా సగం గుండు చేయించుకొని  గురువు ద్వారా ఏ అక్షరాలను తాను ఒంట పట్టించుకున్నాడో దానిని మిగిలినవారికి  ఉచితంగా తెలియజేస్తూ ప్రచారం చేస్తూ ఉంటాడు అలాగే గోష్పాదులు గోపాదం అంత పిలకపెట్టుకొని ఉన్నవాడు  ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాడు అని గుర్తించవచ్చు  ఇలా ప్రతివారికి కొన్ని లక్షణాలు ఉంటాయి దానిని అర్థం చేసుకున్నట్లయితే సనాతన ధర్మంలో ఉన్న  పద్ధతులు అన్ని మనకు తెలుస్తాయి  ప్రతిదానికి బ్రాహ్మణులనే పిలుస్తారు అన్న వాదు ఎలా వచ్చింది  ఆ రోజుల్లో  విద్యార్థికులు ఎవరైతే ఉన్నారో  బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వారిన మాత్రమే బ్రాహ్మణుడు అని పిలిచేవారు పుట్టుకతో సంబంధం లేదు గుణ కర్మ విభాగస్య అని మన భగవద్గీత కూడా చెప్తోంది  వారి గుణం వల్ల వారు చేసే పని వల్ల వారి జాతి నీతి మనం చెప్పవచ్చు.కామెంట్‌లు