వృత్తి;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఆ రోజులలో ఎవరి వృత్తి వారికి ఉండేది  వారికి శాస్త్రీయ పద్ధతిలో విషయాలు చెప్పాలి అంటే శాస్త్రాన్ని చదువుకున్నవాడు మాత్రమే దానికి అర్హుడు కనుక వారి నిమాత్రమే సంప్రదించేవారు  వివాహానికి ముహూర్తం పెట్టవలసి వచ్చినా తిథి వార నక్షత్రాలను లెక్కించి చెప్పగలిగే శాస్త్రం తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే దానిని  పరిగణించి మనకు  సమయాన్ని నిర్ణయిస్తారు  ముహూర్తాలలో కూడా మంచి చెడు రెండు పద్ధతులు ఉంటాయి  ఎవరు దుర్ముహూర్తానికి ఇష్టపడరు కదా సుముహూర్తం ఏదైతే ఉన్నదో దానికోసం అర్రులు చాస్తోంది మనసు  అది నిజమో కాదో ఇతనికి తెలియదు ఆ బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు మాత్రమే దీనిని నిర్ణయించగలడు  అలా వాడికి ప్రాధాన్యత కలిగింది తప్ప  ఈరోజు అందరూ అన్ని విద్యలు నేర్చుకుంటున్నారు కనుక  అన్నిట్లోనూ ప్రావీణ్యం కలిగిన వారు అన్ని కులాలలోనూ మతాలలోనూ వర్గాలలో ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  ఈరోజు ఎవరి నిర్ణయం వారు చేసుకునే స్థితికి వచ్చారు అన్నది యధార్థం. ఎలాంటి తారతమ్యాలు ఉన్నాయి అన్న విషయం బాలలకు తెలియకూడదు  ఒకవేళ వారు ఆ విషయాలను గురించి ప్రస్తావించిన తల్లిదండ్రులు వాటిని  అరికట్టాలి తప్ప ప్రోత్సహించకూడదు  దానివల్ల చిన్నతనం నుంచి ప్రక్కవారిని ద్వేషించే తత్వం  అలవబడుతుంది  దానివల్ల ఎన్నో అనర్థాలు కడగడం సహజం  ఇలా ఆలోచించేవాడు ఒక బృందంగా ఏర్పడతారు  దానిని వ్యతిరేకించేవారుమరొక బృందంగా ఏర్పడి ఏ రోజుకు ఆ రోజు ఆ ప్రాంతంలో వాడు ఏమన్నారు అని వీరు ఈ బృందంలో వారేమో అన్నారని వారు  విమర్శించుకోవడంతోనే సరిపోతుంది అది చివరకు తగాదాల వరకు దారితీస్తుంది  ఆ సందర్భంగా ప్రాణాలు పోయినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు.
అందుకే మన పెద్దవారు ఏర్పాటు చేసిన సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరి మనసుకు అర్థం అయ్యే పద్ధతిలో  చెప్పడం పెద్దల బాధ్యత  తన కుటుంబంలో సభ్యులను ఎలా గౌరవిస్తూ  ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉంటామో  అలాగే ఎదుటివారిని కూడా తనలాగానే గౌరవించుకుంటూ  సహృదయంతో మెలగడం అలవాటయితే  ఈ సమాజంలో కలహాలు రావడానికి అవకాశం ఉండదు  అలాంటి రాజ్యాన్ని రామరాజ్యం అని చెప్పేవారు అప్పట్లో  ఆరోజున అది జరిగిన విషయాన్ని మననం చేసుకుంటూ  అలా మనం ఎందుకు ప్రవర్తించలేము అని మనలను మనమే ప్రశ్నించుకుంటూ మంచిని పెంచడం కోసం  మానవత్వం విలువలు ఏమిటో అర్థం కావడం కోసం  సమాజం సుఖ సంతోషాలతో ఉండాలన్న అభిప్రాయం  స్థిరంగా ఉండాలి అంటే  వారిని సక్రమంగా పెంచే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి.కామెంట్‌లు