తెలివైన రైతు ; సంధ్య--ఎనిమిదవ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్-మెదక్ జిల్లా- 9391201115

  అనగనగా రాజాపురం అనే గ్రామంలో మల్లయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకు నలుగురు కుమారులు ఉన్నారు. మల్లయ్యకు పది ఎకరాల భూమి ఉంది. మల్లయ్య పంటలు బాగా పండించి ఎలాంటి లొటు లేకుండా చూస్తాడు. అందువల్ల నలుగురు కుమారులు ఏమి పని చేయకుండా సోమరిపోతులుగా తయారయ్యారు. 
              మల్లయ్య కొడుకులను ఏమి అనేవాడు కాదు. కానీ కొడుకుల పరిస్థితి చూసి చాలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనకు ఉన్నటువంటి పది ఎకరాల పొలంలో అక్కడక్కడ ధనం దాచి పెట్టాను. మీకు అవసరమైనప్పుడు తీసుకోమని కొడుకులకు చెప్పి మల్లయ్య తీర్థయాత్రలకు పోయాడు. ధనం అనగానే కొడుకులకు ఆశ పుట్టింది. నలుగురు నాలుగు వైపుల నుంచి పొలంలో తవ్వుతూ వచ్చారు. 
               కానీ పొలంలో ఎలాంటి ధనము దొరకలేదు. నలుగురు కొడుకులకు ఏం చేయాలో అర్థం కాలేదు. తండ్రి వచ్చాక అసలు విషయం తెలుసుకుందామని తవ్విన పొలంలో విత్తనాలు నాటి వ్యవసాయం చేశారు. మల్లయ్య తిరిగి వచ్చేవరకు తన భూమి మొత్తం పచ్చగా పైరులతో ఉంది. మల్లయ్య చాలా సంతోషించాడు. కొడుకులను దగ్గరికి తీసుకుని తాను దాచిపెట్టిన ధనం ఈ పచ్చని పైరులని అన్నాడు. కొడుకులు తమ తప్పు తెలుసుకుని, సోమరితనం విడిచిపెట్టి, వ్యవసాయం చేస్తూ జీవించసాగారు.
నీతి: సోమరితనం విడిచిపెడితే చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

కామెంట్‌లు