కొడుకంటే ఎలా వుండాలంటే- - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
   ఒక ఊరిలో ఒక అవ్వ వుండేది. ఆమెకు పెళ్ళయిన కొన్ని దినాలకే మొగుడు చచ్చిపోయినాడు. అయినా కొంచం కూడా భయపడకుండా, బాధను గొంతులోనే దిగమింగి వున్న ఒక్క కొడుకునూ బాగా చదివించింది. పొలాన్ని బాగా సాగుచేసి మంచి పంటలు పండించి నాలుగెకరాలను పదెకరాలు చేసింది. మంచి ఇల్లుగూడా కట్టిచ్చింది. ఆమెకు కొడుకే లోకం. తన కొడుకు చిన్న బాధగూడా పడగూడదని కోరుకునేది.
కానీ వాడు పెళ్ళయ్యాక అమ్మను కొంచంగూడా పట్టించుకోలేదు. ఇంటిబైట వున్న చెట్టు కింద ఆమెకు మంచమేసి అక్కన్నే వుంచేసినాడు. మూడు పూటలా ఏదో కుక్కకు పెట్టినట్టు మిగిలిపోయినవి, పాచిపోయినవి ఒక గిన్నెలో ఏసి ఆమె ముందు పారేసేటోడు. ఎండయినా, చలయినా, వానయినా ఆమె ఆ చెట్టు కిందే. కన్నెత్తి చూసేటోళ్ళు లేక, పన్నెత్తి పలకరించేటోళ్ళు లేక ఆమె ''దేవుడా... ఎందుకు సామీ ఈ బతుకు, తొందరగా నన్ను తీసుకుపో'' అని తెగ బాధపడేది. అక్కడ తిరిగే ఈగలకు, చీమలకు, కుక్కలకు తన బాధలు చెప్పుకోని కళ్ళనీళ్ళు పెట్టుకొనేది.
ఆ వూరి రాజు చానా మంచోడు. జనాలను కన్నబిడ్డలలెక్క కళ్ళల్లో పెట్టుకోని కాపాడుకునేటోడు. అప్పుడప్పుడు చీకటి పడ్డాక మారువేషం వేసుకోని వూరంతా తిరుగుతా జనాల బాధలు తెలుసుకునేటోడు. ఒక రోజు అవ్వ ఒక ఈగకు తన బాధంతా కళ్ళనీళ్ళతో చెబుతా వుంటే విన్నాడు. రాజుకు చానా బాధ అనిపించింది.
తరువాత రోజు పొద్దున్నే ఆ ముసలిదాన్ని, దాని కొడుకుని సభకు పిలిపించినాడు.
''ఏంరా... నీ కోసం చిన్నప్పటి నుంచీ రెక్కలు ముక్కలు చేసుకోని, తినీ తినక ఎన్నో బాధలు పడి పెంచితే.... అటువంటి అమ్మను నెత్తిన పెట్టుకోని పూజించాల గానీ... ఇలా గాలికి వదిలేసి నువ్వు హాయిగా వుంటావా... అసలు కొడుకువేనా నీవు. అమ్మ సంపాదించిన ఇల్లు, పొలాలు కావాలగానీ, అమ్మ వద్దా.... అడిగేటోళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా...'' అంటా కొరడా తీసి కొట్టిన చోట కొట్టకుండా చావగొట్టినాడు.
ఆ తరువాత అవ్వతో ''చూడమ్మా... కన్నతల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకు కొడుకే గాదు. అటువంటోడు పుట్టినా ఒకటే. చచ్చినా ఒకటే. వానిపై మమకారం వదులుకో'' అంటూ ఒక పొట్టెగాన్ని పిలిపించి ''ఇదిగో వీన్ని చూడు.... వీనికి చిన్నప్పుడే యుద్ధంలో అమ్మానాన్నా చచ్చిపోయినారు. ఎవరూ లేరు. అనాథ. నా అనేటోళ్ళు లేక ఎంతో బాధపడుతా వున్నాడు. నువ్వు వూ... అను.  నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడు. నీతోనే వుంటా నువ్వు ఎలా చెబితే అలా వింటాడు. ఏమంటావు. పెంచుకుంటావా. నేను గూడా చివరివరకు నీ బాధల్లో తోడుంటా'' అన్నాడు.
దానికా ముసలామె ''రాజా... నేను బతికినా చచ్చినా పట్టించుకోని కొడుకు నాకెందుకు. ఈ పిల్లోడు నన్ను బాగా చూసుకుంటే నా తరువాత ఇల్లు, పొలమూ గూడా వీని పేరు మీద రాసి పెడతా'' అనింది.
ఆ మాటలకు రాజు సంబరంగా చిరునవ్వు నవ్వి ''శభాష్‌... అవ్వా... ఇదీ మాటంటే. ముసలితనంలో మనలని ఎవరు చూసుకుంటారో వాళ్ళే కొడుకులు గానీ ఇలాంటి వెధవలు కాదు. ఇకపై ఈ ఊరిలో ఎవరు అమ్మానాన్నలను చూసుకోకున్నా వాళ్ళకి వీనికి పట్టిన గతే పడుతుంది'' అంటా వాన్ని ఆ దేశం నుంచి తన్ని తరిమేసి

కామెంట్‌లు