తార;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం949281132
 ఆ మాటలన్నీ విన్న తర్వాత లక్ష్మణునకు విశ్వాసం కుదిరింది సుగ్రీవుని ఉద్దేశం మంచిదే అతను రాముని కార్యంలోనే ఉన్నాడు తార యొక్క ఈ నిరంతర సౌమ్య భావాల పొందికతో సంభాషణా చతురతతో చివరకు లక్ష్మణుడు సుగ్రీవుని వెంటబెట్టుకునే శ్రీరాముని వద్దకు చేరుకుంటాడు జరిగిన తార సంభాషణ రీతిలో గొప్ప రాజకీయ విజ్ఞత కార్యశీలత సాత్విక వినంమ్రత లాడుతున్నట్లుగా కనిపిస్తోంది తార లావణ్య మయ ముఖంతో ఆమె శారీరక సౌందర్యము నిబద్ధత క్రమబద్ధమైన సంభాషణ చాతుర్యాలు మనోవైజ్ఞానిక వ్యవహారంలో ఆమె మానసిక శోభ   ప్రస్ఫుటిస్తోంది  శ్రీరాముని పట్ల ఆమెకు గల అత్యంత భక్తి భావన ఆమె ఆధ్యాత్మిక ఉన్నతిని సాటి చెబుతాయి ఆమె ప్రతి చర్యలో  సతార్కతయే కాదు సత్వరత కూడా అమోఘంగా గోచరిస్తుంది  తార లక్ష్మణుని తన గృహంలోని సుగ్రీవుని కలవడానికి తీసుకుని వెళ్లే గతిశీలతలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. వాల్మీకి మహర్షి మాటలలో ఎంతో విలక్షణత గోచరిస్తుంది  తార వెంట నడుస్తూ లక్ష్మణులు ద్వారా వెళుతున్నట్లు కాకుండా  త్వర పేరు గల వారితో  త్వర త్వరగా అడుగులు వేస్తున్నట్లుందట ఇది చదివిన తార రెండవ పేరు ద్వారా అని కూడా ఉందనిపిస్తోంది సుగ్రీవుడు లక్ష్మణుల సమాగమానికి తార సంధాన కర్తగా వ్యవహరించడం చూస్తూ ఉంటే వివిధ కథాంశాలను అనుసంధానం చేసే తీగ సంధానం లాగా కూడా కనిపిస్తోంది తార శబ్దం యొక్క మౌలిక అర్థం   సంధానము భూమిని ఆకాశంతో కలిపే నక్షత్రాలను తారలు అని అంటాం కదా అంతేకాదు సుగ్రీవుని నూతన  విలాసమయ జీవితంలో కూడా వాసన ఉపాసనల మధ్య సంధి గొలపడానికి స్థాపించింది తార.
రుమా సుగ్రీవుని మనోల్లాసానికి కారణభూతురాలు అయితే తార రాముని కార్యంలో సుగ్రీవుని ఉత్సాహపరిచి బలపరిచే హృదయ తంత్రిగా పాటించవచ్చు వాల్మీకి మహర్షి  తరచుగా తారను గురించి తారాదిపానిభానన (తారల రాజైన చంద్రుని ముఖం వంటి ముఖం కలది) అని వర్ణిస్తూ ఉంటాడు ఎలా విశ్లేషించినప్పుడు కేవలం తారలో భౌతిక సౌందర్య మాత్రమే కాదు  ఆమెలోని మానసిక ఆధ్యాత్మిక శోభ వెలుగులీనుతూ ఉంటుంది  వాలి సుగ్రీవుల మధ్య కూడా తార అనుసంధానం చేస్తుంది వాస్తవంగా ఆలోచిస్తే వాలి మరియు గ్రీవ శరీరంలోని రెండు ప్రధాన అవయవాలు ఇవే క్రమక్రమంగా వానరుడుగా ప్రతీకత్వం పొందారు  వాల్ లేక తోక వానరుని ప్రధాన లక్షణం  గ్రీవ నుంచి వెలువడే వాణి మనుష్యుని ముఖ్య లక్షణం.





కామెంట్‌లు