ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 కొంత సమయం జరిగిన తర్వాత  ఆ వార్తలు తెలిసిన దొరలు ఆ ప్రాంతానికి వచ్చారు  వారు వచ్చేసరికి బండ్లు లేవు బండ్ల సరుకులు లేవు  బండ్లు వెళ్లిన జాడ కొంతవరకు వెతికారు  అక్కడ వరకు  కొంత దూరం వెళ్లిన తర్వాత కనపడ్డాయి కానీ ఆ జాడలు  దగ్గరలోనే మాయమైపోయాయి  జాడలు లేవు బండ్లు లేవు  దోవ కనపడకుండా ఈ బండ్లు ఎలా వెళ్లాయి ఏ ప్రాంతానికి వెళ్లాయి  అని ఎంత వెతికినా  వారికి కనిపించలేదు ఇది ఏదో వింతగా కనిపిస్తోంది అని దొరలు  వెతికి వెతికి హతాసులైపోయారు  జిల్లా కేంద్రం చేరి  అక్కడ ఎంతో విచారించారు  ఇలాంటి వింతలతో ఎన్నో యుద్ధాలు చేశాడు రామరాజు ఆజ్ఞతో అగ్గిరాజు. భయము అనేది లేకుండా  అగ్గిరాజు అనేక వ్యూహాలలో  ఆయన ఒక వీర మూర్తి అతనికి ఎదురు లేదు  యుద్ధం అంటే చాలు మహోగ్రుడై శత్రువులను నుగ్గు నుగ్గు చేసి ఎంతో సాహసంతో జయకేతనాన్ని  ఎత్తగలిగిన సమర్థుడు  రాజు  చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం  అప్పుడప్పుడు సందర్భానుసారంగా రాజు ఆజ్ఞ లేకపోయినా సరే ఒక ఉగ్రరూపాన్ని  దాల్చి  యుద్ధ రంగం వద్ద తన ప్రజ్ఞ చూయించుతున్న  అగ్గిరాజును ఒకరోజు  రాజు మల్ల నుంచి  రాజు అన్ని రోజులు మనవి కావు  తొందరపాటు వద్దు దానివలన చేటు వచ్చే ప్రమాదం ఉంది  అని చెప్పిన నీతిని తలదాల్చి హృదయపూర్వకంగా నొచ్చుకున్నాడు  అయితే ఆ గ్రహం వస్తే మాత్రం  అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేని మనసుతో  అగ్గిరాజు దూసుకు వెళుతూ ఉండేవాడు. సేనలు బాధలు పెట్టినప్పుడు  మనో దౌర్భాల్యముతో భయముతో  వనములో ఉన్న వీరుల జాడలు  ఆ సేవకులకు చెప్పేవారు గత్యంతరం  లేని పరిస్థితిలో అలా చెప్పిన వారిని తీసుకుని వచ్చి అగ్గిరాజు  బాధపెట్టేవాడు  రెండు వైపులా బాధలు అనుభవించే  విప్లవం మాకు దేనికి అని అనేకమంది వ్యతిరేకులు అయ్యారు  మన్యానికి వెళ్లే సరుకులను  అడ్డగింపగలచి గోదావరి తీరములో  సీమ గరిమలో ఉన్న రైల్వే స్టేషన్ లో కాపలాలు ఉంచారు సర్కారు వారు కఠినంగా  మన్యంలో సరుకులు అమ్మడానికి వచ్చే వ్యాపారస్తులకు అనుమతులు ఇవ్వకుండా  ఎన్నో ఎత్తులు వేస్తూ ఉండేవారు  వారి ఎత్తులను చిత్తు చేస్తూ అగ్గిరాజు  ఆ సరుకులను దోచి ప్రజలకు అందిస్తూ ఉండేవాడు.


కామెంట్‌లు