తస్మాత్ జాగ్రత్త ; -అంకాల సోమయ్య-దేవరుప్పుల -జనగాం-9640748497
మనిషి బ్రతుకంతా
పచ్చిమోసమేనా?!
@@@@@@@@
మనిషి బ్రతుకంతా
పచ్చిమోసమేనా?
తియ్యగా మాట్లాడి
బుట్టలో వేసుకొని
నెత్తిన కుచ్చుటోపీ పెట్టడమేనా?

అడ్డమైన గడ్డి కరుస్తు
అన్యాయంగా సంపాదిస్తూ
నమ్మిన ప్రతివారికి
పంగనామంబెడుతూ
కట్టలపాములు పోగేసే
కంత్రీగాళ్ళు

కన్ను మిన్ను గానక
ప్రవర్తించే 
అహంకారులు
అడుగడుగునా దర్శనమిచ్చే
మేకవన్నెపులులు

ఏమారుపాటుగుండొద్దు
సూదిగుచ్చకుండా రక్తపీల్చే
జలగలు
మనిషి రూపంలో ఉన్న
ధన(పేక్షగల)మృగాలు
జాలి దయా హృదయం లో
ఏమూలకూడాలేని
కౄరజంతువులుకామెంట్‌లు