శ్రీ విష్ణు సహస్రనామాలు ;-(బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
246)సత్కర్తాః -

సజ్జనులను సత్కరించువాడు
మంచిపనులను చేయువాడు
కర్తవ్యమునాచరించువాడు 
కర్మధారణము చేయుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
247)అసంఖ్యేయః -

సంఖ్యలతో చూపలేనివాడు
అనంతమైన రూపములున్నవాడు
అనేకనామములున్నవాడు 
సంఖ్యయనునది లేనివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
248)అప్రమేయాత్మా-

ఇంతని చెప్పలేనట్టివాడు
మితిని విధించలేనివాడు
అప్రమేయ స్వరూపమున్నవాడు
అవధిలేని పరివ్యాప్తకుడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
249)విశిష్టః -

సర్వశ్రేష్టుడు అయినట్టివాడు
విశేషగుణములున్నవాడు
గొప్పగుర్తింపు గలిగినవాడు
స్వామి విలక్షణమైనట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
250)శిష్టకృతిః -

శాసనము చేయగలవాడు
ఆజ్ఞలను జారీచేయువాడు
ఆనతి నిచ్చుచున్నట్టివాడు
జ్ఞానమునందించగల వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు