ఓ పువ్వు
పిలిచింది
పసిపాపలా
పకపకానవ్వుతూ
ఓ పువ్వు
పరవశపరిచింది
పేరంటాలులా
పలుమాటలుచెబుతూ
ఓ పువ్వు
పరిమళంచల్లింది
పీల్చమని
పులకరించపరుస్తూ
ఓ పువ్వు
పొంకాలుచూపింది
పలురంగులుచూపి
ప్రేరేపిస్తూ
ఓ పువ్వు
ప్రోత్సాహపరచింది
పేనాపట్టమని
పుటలునింపమనీ
ఓ పువ్వు
ప్రణాళికిచ్చింది
పదాలుపేర్చమని
ప్రాసలుకూర్చమనీ
ఓ పువ్వు
అందాలనుచూపింది
అంతరంగానికి
ఆనందమునివ్వమంటూ
ఓ పువ్వు
పాటపాడింది
శ్రావ్యతను
చెవులకందిస్తూ
ఓ పువ్వు
నవ్వించింది
పెదాలనుకదిలించి
మోమునువెలుగిస్తూ
ఓ పువ్వు
నోరూరించింది
తేనెచుక్కలుచల్లి
తియ్యదనాన్నిచేకూర్చుతూ
పువ్వు
కవ్విస్తుంది
కవితలను
వ్రాయమంటూ
పువ్వు
ప్రక్కకొస్తుంది
పరిహాసాలాడి
ప్రీతినందిస్తూ
పువ్వు
నాదీ
ప్రేమ
నాదీ
సుమము
నాదీ
సోయగము
నాదీ
కుసుమము
నాదీ
కుతూహలము
నాదీ
ఆర్తవము
నాదీ
ఆహ్లాదము
నాదీ
పూలలోకంలో
విహరిస్తా
పుష్పకవితల్లో
ముంచేస్తా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి