*ఎలైట్ రైటర్స్ అసోసియేషన్ ఉత్తమ రచనగా తెనాలి వాసి షేక్ అస్మతున్నీసా రాసిన రచన*


 
 తెలుగు భాష మాధుర్యం ఎనలేనిదని, తెలుగు భాషకు పట్టాభిషేకం కట్టాలంటూ   ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు, ఎలైట్ రైటర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాహిత్య పోటీలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలి  పట్టణానికి చెందిన షేక్ ఆస్మా తున్నీసా  రాసిన ( నిజ నేస్తం లా నువ్వే   ) ఉత్తమ రచనగా  ఎంపిక కాబడినది.
           ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న అస్మతున్నీసా తెలుగు సాహిత్యంలో తనదైన ప్రత్యేక కోణంలో ఆసక్తితో ముందుకు సాగుతున్నారు. దాదాపు 300కు పైగా  వివిధ రాష్ట్రాల నుండి  తెలుగు కవులు, రచయితలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో  కొనసాగుతున్న ఇట్టి కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులుగా  కె.పద్మావతి, కె.విద్యుల్లత, టి.సాధన  సమీక్షకులుగా  న్యాలకంటి నారాయణ లు వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా  ఎలైట్ రైటర్స్ అసోసియేషన్ సంస్థ  చైర్మన్ డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్  మరియు సమూహ నిర్వాహకవర్గం కవయిత్రి కి అభినందనలు తెలియజేసింది.

కామెంట్‌లు