మన గుండె
ఒక గిజిగాడు అల్లిన గూడు
గజిబిజిగానే ఉంటుంది
కానీ
గట్టిగా తట్టుకొని నిలబడుతుంది.!!
మన గుండె
ఒక పిచ్చుక గూడు
పచ్చగడ్డి తోనే కట్టబడుతుంది.
కానీ పిచ్చుకలు రెండు
పది కాలాలపాటు పచ్చని కాపురం ఉంటాయి.!!!
మన గుండె
ఒక. సాలీడు గూడు
అందులోకి ఎవరూ రారు వస్తే తిరిగి పోరు.
కానీ అది మనకు మనం అల్లుకొని
మనం అందులోనే చిక్కుకుంటాం.!!!
మన గుండె
ఒక రాతి పిరమిడ్
అది వేల ఏళ్ల నాటి సమాధి గది.
దానికి ద్వారం లేదు దారి లేదు.!!!?
మన గుండె
పచ్చి ఇసుకతో కట్టే పిట్టగూళ్ళు
కానీ
మన మనసులో
ఎప్పటికీ కూలిపోని గొప్ప కాంక్రీటు కట్టడాలు.!!!
మన గుండె
ఒక పాలరాతి జలపాతం
ఎప్పుడు తామరాకుపై నీటిలా
తాజాగా తాజ్ మహల్ లాగా ఉంటుంది.
అది కోట్ల గుండెల్లో కొలువై ఉంటుంది.
కోట్ల కళ్ళల్లో వెలుగై ఉంటుంది.!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి