తెలుగు భాష సేవా రత్న - బోణం గణేష్
 *రాష్ట్ర ప్రభుత్వం నుంచి పురస్కారం అందజేసిన అధికార భాషా సంఘం.
-------------------------------------------------------------------------------------
పత్రికా రంగంలో మరియు తెలుగు భాషా వికాసానికి జర్నలిస్ట్ బోణం గణేష్ చేస్తున్న కృషికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు "తెలుగు భాష సేవారత్న పురస్కారం" అందించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షుడు శ్రీ పి.విజయబాబు, ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్ర తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ వెంకట్ మేడపాటి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ పట్టేటిల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని 05-02-2024న నిర్వహించింది..ఈ వేడుకలో సుప్రసిద్ద సినీ రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ దర్శక,నిర్మాత శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ,పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు, నాగార్జున యూనివర్శిటీ డీన్ డాక్టర్ సునీత..మరియు ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డును బోణం గణేష్ గారు స్వీకరించడం జరిగింది.
పదహారేళ్లుగా పాత్రికేయునిగా, కవి,రచయితగా సాహిత్యానికి గణేష్ సేవలందిస్తున్నారు. ఆయనకు అవార్డు రావడం పట్ల పలువురు సాహిత్య కారులు హర్షం వ్యక్తం చేశారు.
బయోడేటా:
పేరు: గణేష్ బోణం
చదువు: ఆంధ్రవిశ్వ విద్యాలయం నుంచి జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ.
వృత్తి/ ప్రవృత్తి: జర్నలిస్ట్, కవి, రచయిత, నటుడు
స్వస్థలం: రామన్నగూడెం, తాడేపల్లిగూడెం మండలం,పశ్చిమ గోదావరి జిల్లా
నివాసం: విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఉద్యోగం: సాక్షి దినపత్రిక రాష్ట్ర విభాగం(స్టేట్ బ్యూరో)లో సీనియర్ రిపోర్టర్.
#అవార్డులు, సత్కారాలు: 
ఉత్తమ తెలుగు భాష సేవకుడిగా, అంతర్జాతీయ తెలుగు మహా సభలు, శ్రీశ్రీ కళా వేదిక, శ్రీ ఆదిభట్ల ఫౌండేషన్, కణిక,  అక్షరస్వరం, అక్షరలిపి, ఆర్ట్ ఫౌండేషన్, సేవ,తపస్వి మనోహరం, కవితారల వేదిక వంటి అనేక సాహిత్య సంస్థల నుంచి పురస్కారాలు, ఉత్తమ జర్నలిస్టుగా ప్రభుత్వ మరియు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం నుంచి పురస్కారం, ఉత్తమ పర్యావరణ హితుడుగా స్పార్క్ సొసైటీ పురస్కారం, ఉత్తమ‌ నటుడిగా జిల్లా స్థాయి పురస్కారం, ఉత్తమ సేవకుడిగా అంతర్జాతీయ స్థాయి లయన్స్ క్లబ్ అవార్డు..ఇలా‌ ఎన్నో అవార్డులు గణేష్ ను వరించాయి.తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి తెలుగు భాష సేవారత్న అవార్డును బహూకరించింది.



కామెంట్‌లు
THE PEN చెప్పారు…
నా ఉన్నతిలో మొలక సహకారం‌ కూడా ఎంతో ఉంది..నిర్వాహకులకు కృతజ్ఞతలు