మేడారం జాతర! అచ్యుతుని రాజ్యశ్రీ

 అంబరాన్నంటే సంబరాలు
కుంభమేళా తర్వాత తెలంగాణ
గిరిజనుల పండుగ
సమ్మక్క సారలమ్మ పేరు తో
మేడారం జాతర చూడరెండు కళ్లు సాలవంట
పదమూడో శతాబ్దిలో మారుమూల "మరం"లో
గాండ్రుమనే పులులమధ్య
కేరింతలతో పసిపాప
సమ్మక్క గా పెరిగి గిరిజన సంరక్షకురాలిగా 
పగిడిద్దరాజు ఆలిగా సారలమ్మ నాగులమ్మ జంపన్న 
తల్లిగా ములుగంతా వెలుగులు నింపే
మేడలు మిద్దెలు వద్దు రెండు గద్దెలపై రెండేళ్ల కోపారి కూకుండబెడ్తే సాలు
కోయదొరల బలిమి చెలిమి కి
ప్రతాపరుద్రుడే విస్తుబోయె
కరువు రక్కసికి సిక్కిన తండాల పానాలు
పన్నుకట్టలేక గిలగిలా వలవలా ఏడ్సి మొత్తుకున్నా 
జబర్దస్తీ జులుం కి మొగుడు అల్లుడు బిడ్డలు కన్నుమూసెనంట
రౌద్రంతో సమ్మక్క పోరుతో కకావికలమైన కాకతీయ సైన్యం
దొంగచాటు వెన్నుపోటు తో
చిలుకలగుట్ట మలుపులో
నెమలి నారు సెట్టు పుట్టకాడ
మాయమయ్యే సమ్మక్క
కుంకుమ భరిణె వెదురు కర్రలే ఉత్సవమూర్తులు
రెండేళ్ల కోపారి రెండు గద్దెలపై ఉత్సవాలు జరపాలని
 ఆకాశవాణి ఆనతితో గిరిజనుల కప్పాలు రద్దు చేసే రాజు
బంగారం బెల్లం తో కానుకలు
నాల్గవనాడు వనప్రవేశంతో
కోటాపైగా భక్తులు కోటికోటి దండాలు పెట్టంగా ముక్కోటి దేవతలు సూడంగ
మేడారమంతా సంబరాలు
తెలంగాణ లో వనదేవతల విహారాలు 🌺
కామెంట్‌లు