పాప ప్రక్షాళన;- సి.హెచ్.ప్రతాప్

 భారతీయ సంస్కృతి,సాంప్రదాయాలకు అనాది నుండే గొప్ప విలువలను కలిగి ఉంది.అందుకే విదేశీయులు సైతం మన సాంప్రదాయ,సంస్కృతులను ఆచరిస్తూ గొప్పగా గౌరవిస్తున్నారు .మన పూర్వీకులు,బుషులు తమ నిరంతర శోధన అనుభంతో మనకు మంచి జీవితాలను అందించాలని వారు కొన్ని సూచనలను చేసారు. వేద శాస్త్రాల ద్వారా అతి వులువైన జ్ఞాన సంపదను మనకు అందించారు. వాటిని చదివి, అర్ధం చెసుకొని, ఆచరించడం ఎంతో అవసరం. ఒకరికి మంచి చేయకపోయినా ఫర్వాలేదు... చెడు మాత్రం చేయవద్దు" అని శాస్త్ర వచనం. అకారణంగా పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో పట్టి పీడిస్తుంది. పూర్వ జన్మలో చేసిన పాపాల ప్రభావం, వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు, నామస్మరణ, దాన ధర్మాలు, గ్రహ, పాప శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి.ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో పూర్వ జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి.తెలిసి చేసిన తెలియక చేసిన పొరపాటు పొరపాటే అవుతుంది.తెలియక పొరపాటున చేసిన దానికి కొంచం తక్కువ శాతం చెడు ఫలితం ఉంటుంది కాని ఫలితం అనుభవించక తప్పదు.కర్మ ఫలాన్ని ఎవ్వరు తప్పించలేరు.కాబట్టి మానవ జీవనం కొనసాగిస్తున్నప్పుడు మంచి,మర్యాద పాటించాలి.పాప భారం మరీ ఎక్కువగా లేకపోతే వెంటనే ఆ పాపం తొలగిపోతుంది. కొంచెం ఎక్కువగా వుంటే ఆ చెడు కర్మ ఒకొక్కసారి తక్కువ భారంతో అనుభవింప చేసి మనల్ని ఉద్దరిస్తారు. మనం అటువంటి గురువుల వద్దకు వెళ్ళాలంటే మనకు అంతకు సరిపడ్డా పుణ్యం వుండాలి. ఎప్పుడు ఆ పుణ్యం మనకు అనుకూలిస్తుందో అప్పుడు మనకు వారిని ఆశ్రయించాలని బుద్ధి పుడుతుంది, లేక ఆ పరిస్థితులు అనుకూలిస్తాయి.గురువు అనుగ్రహంతో పొందలేనిదిలేదు. గురువును ఎలా సేవించాలో తెలిసిన వాడికి వేదవేదాంగాలు కరతలామలకం అవుతాయి. అష్టసిద్ధులు ఆధీనమై సర్వజ్ఞుడవుతా డు. పురాణాలు, ఇతిహాసాల్లో గురువులు శిష్యులను కటాక్ష వీక్షణాలతో సర్వ శాస్త్ర పండితు లను చేసిన తార్కాణాలు అనేకం.దేవుడు అసలు తప్పే చేయవద్దని చెప్పాడు. ఎవరికి హాని చేయవద్దు అని చెప్పాడు. తోటి వారి పట్ల జాలి దయ కలిగి ఉండమన్నారు. భగవంతుడికి వ్యతిరేకంగా చేసే ప్రతిదీ పాపమే. అలాంటి పాపాలు చేసి దేవుడికి చెప్పుకుంటే ఆ తప్పులు ఏమాత్రం తగ్గవు. ఎవరికైతే తప్పు చేశారో వాళ్లని క్షమాపణ అడిగితే పాప ప్రక్షాళన జరుగుతుంది. భగవంతుడితో చెప్పుకోవడం వలన కేవలం ఓదార్పు లభిస్తుంది. గుండెల్లో ఉన్న భారం తగ్గుతుంది. కానీ తప్పు చేశామని భావన కచ్చితంగా లోపల ఉంటుంది. ఆ తప్పును మరోసారి చేయమని భగవంతుడికి సంకల్పం చేసుకోవాలి. అలా చెప్పుకోవడం వలన మరోసారి ఆ తప్పు చేయకుండా ఉంటారు.
కామెంట్‌లు