కన్న వాళ్ళ కలలు ;- చిత్తారి వైష్ణవి, 6వ తరగతి, జెడ్పిహెచ్ఎస్ ఇబ్రహీం నగర్, మండలం చిన్నకోడూరు, సిద్దిపేట జిల్లా. సెల్: 6305727895.
 అనగనగా ఒక ఊర్లో రామయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతని ఇల్లు తూర్పు దిక్కు ఉంటుంది. అతనికి ఒక కొడుకు, ఒక బిడ్డ ఉండేవాళ్లు. భార్య కూడా ఉండేది. కొడుకు పేరు హరీష్. బిడ్డ అంజలి. భార్య రమ. ఈ వేసవికాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఒకరోజు రామయ్య కరువు పనికి వెళ్లి వస్తుండగా అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాడు. ఒక వ్యక్తి రామయ్యను చూసి రామయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి రామయ్య వాళ్ళ భార్య రమకు అప్పగించాడు. ఆమె వెంటనే హాస్పటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించింది. డాక్టర్ రామయ్యను చూసి "ఏం పర్వాలేదు. రామయ్య మంచిగానే ఉన్నాడు. వడదెబ్బ తగిలింది. ప్రమాదకరంగా లేదు కాబట్టి తీసుకువెళ్ళు" అని చెప్పాడు డాక్టర్. 
 రమా రామయ్యను వాళ్ళింటికి తీసుకువెళ్లి  అన్నం కూర వంట చేసింది రామయ్యకు అన్నం కూడా వేసి తినమని చెప్పింది. రామయ్య అన్నం తిన్నాడు. ఆ తరువాత గోళీలు, మందులు వేసుకున్నాడు. పిల్లలు బడికి వెళ్లి వచ్చారు. "అయ్యో నాన్న ఏమైంది?"అని అడిగారు.
"నాన్నకు ఏం కాలేదు. వడదెబ్బ వల్ల కండ్లు తిరిగి పడిపోయాడు. కానీ ఏం కాలేదు."అని తల్లి రమ చెప్పింది. పిల్లలు ఆడుకోనికి వెళ్లారు.
కొన్నాళ్లకు
"చాతిలో నొస్తుంది నొస్తుంది" అంటూ చాతి పట్టుకొని కింద పడిపోయాడు రమ వచ్చేసరికి.
హాస్పిటల్ తీసుకపోగానే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. రామ, పిల్లలు బాగా ఏడిచారు. కొద్ది రోజుల తరువాత. రమ పిల్లల్ని పోషించడానికి ప్రతి పని చేసింది. కూలికి వెళ్ళింది. చేను పనికి వెళ్ళింది. కూరగాయలమ్మింది. వేసవికాలంలో సోడా బండి పెట్టింది.  రకరకాలుగా కష్టపడి పిల్లలను ప్రయోజకులు గా చేసింది.  తరువాత కొన్నాళ్లకు రమ కొడుకు హరీష్ పెద్దవాడు అయ్యాడు. బాగా చదువుకొని మంచి టీచర్ ఉద్యోగం వచ్చింది. రమకు సంతోషం అనిపించింది. కొడుకుకు  రోహిణి అనే పేద అమ్మాయితో పెళ్లి చేసింది. రోహిణి అత్త రమ చెప్పిన మాట వింటుంది. ఆ తరువాత  అంజలికి కూడా పెళ్లి చేసింది. అల్లుడు పేరు ప్రభాకర్. బిడ్డ అంజలి నీ అత్తగారింటికి పంపించింది. అక్కడ అత్త కూడా బాగానే చూసుకుంటుంది అంజలిని. కొన్ని రోజుల తరువాత కొడుకు హరీష్  రోహిణిలకి బిడ్డ పుట్టింది. రమ ఏం చేసిందంటే కొడుకు ఆ బిడ్డకు తాత పేరులోని మొదటి అక్షరం 'రా' కలిసేలా రవళి అని నామకరణం చేసింది.  రమ ఉయ్యాల తెచ్చి దానికి బంతిపూలు  డెకరేషన్ చేయించింది. రమ మనమరాలు ఉయ్యాల లో పడుకోబెట్టింది. వచ్చిన చుట్టాలు అందరికీ మంచి విందు భోజనం ఇచ్చింది.
తల్లిదండ్రులు మాట విన్న హరీష్ గొప్పవాడయ్యాడు. పిల్లలే  సర్వస్వంగా బతికిన రమ జీవితం ధన్యమైంది. హరీష్ ని ఎవరు అడిగినా మన అమ్మానాన్నల కష్టం రూపుమాపడానికి మనం బాగా చదవాలి వారు అనుకున్నట్లు ఉద్యోగమో వ్యాపారమో చేయాలి. అటు తల్లిదండ్రులకు ఇటు మనకు జీవితమంటే సంతృప్తి కలుగుతుంది. మీరు కూడా అలా ఉండాలి.
-కథలో నీతి: తల్లిదండ్రుల మాటల్ని పిల్లలు విని పాటించాలి అప్పుడే గొప్ప వాళ్ళు అవుతారు.-
కామెంట్‌లు