వేదం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఇలా ప్రతిదీ రుజువు చేసుకుంటూ వెళ్ళింది భారతదేశ అధర్వణ వేదంలో చెప్పిన అనేక విషయాలు స్పష్టంగా ఈరోజు మనం గమనిస్తూనే ఉన్నాం  చూస్తూ అనుభవిస్తూ ఉన్నాం  ఇంకా సామ విషయం దగ్గరకు వచ్చేసరికి  నిజానికి వేదాంతం  అంటేనే మనకు తెలియని విషయం  అని   లోకంలో ఒక ప్రతీతి ఉంది  శంకరాచార్యుల వారు చెప్పిన అద్వైత సిద్ధాంతాన్ని  ఎద్దేవా చేస్తూ  దేవుడు ఉన్నాడా లేదా అన్న విషయాన్ని గురించి అనేక వాదోపవాదాలు రావడం మనం గమనించాం  దేవుడు అనే పదానికి అర్థం తెలియకుండా భగవంతుడు అంటే ఏమిటో తెలియకుండానే భోగానికి దిగి ఇటువంటి  అల్ప జ్ఞానులు కొందరి వల్ల ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుడు అంటేజ్ఞానం కలిగిన వాడు అని అర్థం  భగవంతుడు అంటే వెలుగు చూపేవాడు ఆజ్ఞానం ఎవరికి ఉంది గెలుపు ఎవరిది కావాలి ఈ రెండు మానవ మాతృలకే కదా  వారికి జ్ఞానం లేదా మార్గం తెలియదా  అని వేదాంతం చెబుతూ ఉంటారు  అహం బ్రహ్మాస్మి అన్న సూత్రం  వేద వచనం కాదా  అసలు మానవ జీవితానికి అర్థం తెలియని వాదోపవాదాలు వినాలా జీవి తనువుతో కూడినది జీవితం అని కదా అర్థం  లోపల జీవి ఉండి  ఆ జీవి ఆకారం  శరీరం  ఉంది  ఈ రెండు వేరువేరా ఒకటేనా ఇది అర్థమైతే శంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతం అర్ధమైనట్లే భగవంతుడు వేరుగా భక్తుడు వేరుగా ఉన్నారా  నీలో ఉన్న ఆ జీవి ప్రపంచానికి కనిపిస్తున్న తనువు వేరువేరు కాదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసేదే జీవితం  అదే భగవద్గీత. నిజమైనది నీకు తెలుసుకోవాలి అనుకున్న సాధకుడు  పద్మాసనంలో కూర్చుని  రంభను  ఊర్వశిని మేనకను తిలోత్తమను  స్వాధీనం చేసుకొని  ఏకాగ్రచిత్తంతో  కుండలి నుంచి  సహస్రానికి  నీ మనసు అంటే వెన్నుపూస ద్వారా ప్రయత్నం చేసి ఒక్కొక్క దానిని స్వాధ్వినం చేసుకున్నట్లయితే  మెదడు వరకు వెళ్లి ఆ పై పొరను తీసి  కపాలానికి మెదడుకు మధ్య ఉన్నటువంటి  నల్లటి పదార్థం  తమస్సును చేరి  అక్కడ నుంచి  వెలుగు కోసం ప్రయత్నం చేయడానికి కపాలమోక్షం   పొందటానినే  తమసోమా జ్యోతిర్గమయా అన్న  ఉపనిషద్వాక్యంతో తెలియజేస్తారు  అజ్ఞానంలో ఉన్న  అంటే చీకటిలో ఉన్న వ్యక్తి  సు విజ్ఞానానికి  అంటే వెలుగులోకి ప్రవేశించే దాన్నే  జీవిత పరమార్ధంగా చెబుతారు వేదాంతులు. 
కామెంట్‌లు