కొడుకు బాధ్యత ;- కె. ఉషశ్రీ -తరగతి: 9వ తరగతి-- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీర్మాల.-మండలం: దేవరుప్పుల- జిల్లా: జనగాం
 అనగనగా ఒక ఊరిలో అంజయ్య ,అంజమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు పేరు రాజు ఇది వారి కుటుంబం. రాజు ప్రతిరోజు పాఠశాలకు వెళ్తాడు. అంజయ్యకు పాపం పక్షవాతం వచ్చింది. అంజమ్మ చిన్న కూరగాయల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. కూరగాయలు అమ్మిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేది. ఇంటి అవసరాలకు డబ్బులు లేవు. అంజమ్మ కూరగాయలు అమ్ముతూ కూలీ పనికి కూడా వెళ్తుంది. రాజుకి డాక్టర్ కావాలని కోరిక ఉన్నది. వాళ్ల నాన్నకి పక్షవాతం వచ్చింది. నేనే  మా నాన్న జబ్బు నయం చేయాలని రాజు కోరిక. రాజు కుటుంబ జీవితం ఇలాగే కొనసాగుతుంది. రాజు చదువు అయిపోయింది. డాక్టర్ చదువు కోసం వెళ్లి చదువుతున్నాడు. అలా కొన్ని సంవత్సరాలు చదివాడు. రాజు కోరిక మీదకు డాక్టర్ అయ్యాడు. వాళ్ల నాన్నకు రాజు నే వైద్యం చేశాడు. వాళ్ల నాన్నకు కాలు, చేయి పని చేస్తుంది. రాజు వాళ్ల అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారు. ఇక రాజు పెండ్లి కూడా చేశారు. ఇక అందరూ కలిసి ఉన్నారు. అంజయ్య, అంజమ్మ మనవడితో సంతోషంగా ఆడుకుంటున్నారు. రాజు వాళ్ల భార్య ఇద్దరూ వారి వారి పనులు చేసుకుంటున్నారు.
నీతి: తల్లిదండ్రులు మనల్ని కన్నందుకు వారిని మనం ప్రేమగా చూసుకోవాలి. పిల్లలే వైద్యుని లాగా తల్లిదండ్రులను చూసుకోవాలి. రాజు కోరిక మీదకు డాక్టర్ అయ్యాడు. తండ్రికి తానే వైద్యం చేసి మామూలు మనిషిని చేశాడు. ప్రతి కుటుంబంలో ఇలాంటి కొడుకు ఉండాలి.

కామెంట్‌లు