వన దేవతకు ఆహ్వానం !!;- ''రసస్రవంతి' & 'కావ్యసుధ"9247313498 : హైదరాబాద్.
అమ్మల గన్నమ్మకు,ముగు 
రమ్మల కే మూలమైన అమ్మను గొలచీ
సమ్మక్క సారమ్మల
నెమ్మితొ పూజింతు మనసు నిర్మల మవగన్ 

అపర పరాశక్తులగుచు                              
సఫలాలందించి, జన్మ సార్థకమవగా
అపురూప దైవ లీలల
కృపతో జూపించి జనుల కిత్తురు వరముల్ 

అక్కలుగా అమ్మలుగా
మ్రొక్కుల నందేటి దివ్య మూర్తుల కెపుడున్
మిక్కిలి సంతోషముతో                            
  మ్రొక్కుదు పాదాలు  
బట్టి ముప్పులు దప్పన్ 

సమ్మక్క  సారలమ్మల
నెక్కడ నేవేళ నైన నిర్మల మతులై
చక్కగ పూజలొనర్చిన
మిక్కిలి దయ జూపగలరు
మేలొనరింపన్

చక్కని తల్లులు వీడని                              
చిక్కులు విడదీసి దరికి జేరి బిరానన్
మక్కువతో నాదుకొనుచు
ప్రక్కన నిలిచేరు , జనుల పాయని కరుణన్

కామెంట్‌లు