ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 నేను చెబుతున్నాను ఇది తప్పక జరిగే తీరుతుంది నా జోస్త్యము ఎప్పుడూ అబద్ధం కాలేదు  నా నోటి నుంచి వచ్చిన ప్రతి అక్షరం నిజమవుతుంది  అని పలుకుతున్న రాజును చూసి ఆగ్రహంతో  కల్లు తాగిన కోతి లాగా లేచి నేను సైన్యాధిపతిని  నా ముందు నీవు మాట్లాడే పలుకులు ఇలాగేనా  మీకు ఈ క్షణం అనేది ఏంటో రుచి చూపిస్తాను మరణం అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను  కోర్ట్ మార్షల్ విధిస్తాను  అంటూ  దుర్మార్గుడు లోపలికి వెళ్లి తిరిగి పవిత్ర గ్రంథమైన బైబిల్ ని చేతిలో పట్టుకొని వచ్చి  మోకాళ్ళపై నిలిచి మోర పైకెత్తి  అడ్డంగా నిలువుగా గుండెపై క్రాసుని తిప్పుతూ దేవుని స్తుతి చేశాడు  ఆ తరువాత చంపడానికి ఆజ్ఞ ఇచ్చాడు.
రెచ్చిపోయిన ఆ తెల్ల జాతి రాక్షసుడు  రాజును  చెట్టునకు కట్టారు  రాజు కళ్ళు కనిపించకుండా  బట్టలు  కట్టారు  చెట్టుకు కట్టి వేసి చేతిలో తుపాకులను పెట్టుకుని  ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు  అప్పుడు కూడా రాజు వద్దకు వెళ్లి చివరి కోరిక చెప్పు  అని అడగగానే  నన్ను విచారించకుండానే ఇలా చంపడం మీ  నీతియా  కలెక్టర్ ను పిలువు అతనితో మాట్లాడుతాను  అని అడిగిన  అతను అంగీకరించక  జమేదారుకు కాల్చమని ఆజ్ఞ ఇచ్చాడు  రాజును పట్టుకు తీసుకువచ్చిన పోలీసులు అందరూ కూడా అయ్యో పాపం అంటూ జారి చూపి దుర్మార్గుడైన వీడి చేతికి వారిని అందించాం  ఇది ఏమి న్యాయం  ఇలాంటి పని చేయవచ్చునా  కనీసం విచారించవలసిన అవసరం కూడా లేదా అంటూ గుసగుసలాడుతూ దుఃఖిస్తూ ఉన్నారు. కాల్చడానికి ఉద్యుక్తు డైన జమేదార్  చేతులు వణుకుతూ ఉండగా కాల్చాడు  గుండెకు తగలవలసిన ఆ గుండు  గురి తప్పి భుజానికి తగిలింది  అప్పుడు కులువురుడు అయినా వాడు కసిగా అతనిని తిడుతూ  రాజు దగ్గరగా వెళ్లి తాను కాల్చాడు  ఎంతో తాదాప్యంతో  ఆకాశం వైపు తల ఎత్తి చూస్తూ  ఆ తపసి మహాయోగి  అల్లూరి రామరాజు  తల  వాల్చాడు  అది చూసిన సైనికుల ఆత్మలు ఘోషించినై  అది చూడలేక సూర్యుడు  అస్తమించాడు  శవాన్ని దించి  ఆ చెట్టును కొట్టించి కాల్చి బూడిద చేశారు  కాల్వలో కలిపారు  అలా చేసి పరమ క్రూరైన గుడాల్  పరమ నీచుడిగా పేరు పొందిన వాడు తన కసిని తీర్చుకున్నాడు. ఆ రాత్రి రోజర్ అడవి కమిషనర్ శ్రీని అనే సైనిక అధికారి ఆ ప్రాంతాల ఉన్న అదనపు అధికారులు గూడాల్ డేరా లోపలికి వచ్చారు.
కామెంట్‌లు