ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 వ్యక్తిగత ఆస్తిపాస్తులు లేవు  కుటుంబం గడవాలి  దానికోసం  తనకు చదువు సంధ్య లేదు  ఏం చేయాలో తోచక విశాలాంధ్ర పత్రిక  ఆఫీసులో  రాత్రులు కాపలా కాసే వ్యక్తులు కావాలన్న  వార్త తెలుసుకొని అక్కడకు వెళ్లి వారిని బ్రతిమలాడి తన పరిస్థితిని తెలియజేసి అక్కడ చేరి రాత్రులు అక్కడ కాపలా కాస్తున్న జీవితం వారిది  ఒక సందర్భంలో డాక్టర్ కె వెంకటరాజు గారు అల్లూరు వారి గురించి ఒక సభలో మాట్లాడడం విని వారిని కలిసి తన జీవితం ఇలా  జరుగుతోంది నా జీవితంలో ఒక్కసారి అయినా వారితో కుస్తీ పట్టాలి అనుకున్నాను  అది జరగలేదు ఆ నిరాశలో ఉన్నాను అని డాక్టర్ రాజు గారికి చెబితే  మీ కోరిక చాలా గొప్పది  నీ ఆశయం కూడా  మెచ్చుకోదగినది. పత్రికలలో వచ్చిన వార్తలు కానీ ప్రభుత్వం ప్రకటించిన విషయాలు కానీ పట్టించుకోవద్దు అల్లూరి వారు సజీవులు  వారు ఫలానా చోట ఆశ్రమము నిర్మించుకొని ఏకాంత వాసంలో ఉన్నారు  వారిని కలవాలి అనుకుంటే  తప్పకుండా వారు దర్శనం ఇస్తారు అని వారికి రాజు గారి చిరునామా ఇచ్చి పంపించిన తరువాత  జీవితంలో ఇది జరగదు అనుకున్న విషయం జరగబోతుంది అని తెలిస్తే ఆ వ్యక్తి ఎంత అమంద ఆనందాన్ని అనుభవిస్తాడు అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది తన చేతిలో డబ్బులు లేకపోయినా ఆఫీసుకు వెళ్లి  అడ్వాన్స్ గా డబ్బులు తీసుకొని బయలుదేరి వెళ్లారు  డాక్టర్ గారు చెప్పిన చిరునామా వెతుక్కుని వెళ్లి రామరాజు గారిని కలవడం  ఒక అపూర్వ సంఘటన రామరాజు గారిని కలిసి తన   కోరికను తెలియజేసి  ఇలా జరిగింది మా డాక్టర్ రాజుగారు మీ చిరునామా  నాకు ఇచ్చి మీ వద్దకు పంపించారు అని చెప్పిన తరువాత వారు ఆనందించి  చాలా ప్రయాసపడి వచ్చారు ముందు ఫలహారం చేయండి  అనితన  దగ్గర ఉన్న  పండ్లను ఇచ్చి  తరువాత విశ్రాంతి తీసుకో మని చెప్పాడు  సాయంత్రం లేచిన తర్వాత  మీకు వచ్చిన విద్యలను ప్రదర్శించండి  తర్వాత ఇద్దరం కలిసి ఏం చేయాలో అది చేద్దాం  అని తాను నిలబడి  తన చేతిని దండచేతిగా మార్చి  వారిని కొట్టమన్నారు  ఎంత కొట్టినా వారి చేతులకు నొప్పి తప్ప  రామరాజు గారు  నిబ్బరంగా ఉన్నారు  తన ఓటమిని ఒప్పుకున్న తరువాత  ఇది ఓటమికి కిందకు రాదు  ప్రయత్న లోపం  ప్రయత్నిస్తే మానవుడు సాధించలేనిది ఏదీ లేదు అన్నారు రామరాజు గారు.

కామెంట్‌లు