మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 కలియుగంలో భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామి అని చెప్తారు  ఇది అందరూ అనుసరిస్తున్న విషయం  ఉదయం లేవగానే  వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం వింటే అన్ని శుభాలే జరుగుతాయని ప్రతి ఒక్కరి విశ్వాసం  ప్రత్యేకించి మా డాక్టర్ వెంకట్ రాజు గారు  ప్రతి తెలుగు సంవత్సరం ఉగాదికి  ఉదయం  మూడు గంటల  25 నిమిషాలకు స్వామి ఎదురుగా ఉండడం  అలవాటుగా మారింది  వారిని గురించి  నమ్మినవారికి కొంగుబంగారం అని చెప్తారు డాక్టర్ గారు  వారి   గదిలో వారు కూర్చున్న  స్థలం  ఎంతో పవిత్రమైనదని పెద్ద ఛాయాచిత్రం వెంకటేశ్వర స్వామి వారి  చిరునవ్వులు చిందిస్తూ ఉన్న వారి ఆశీస్సుల కోసం ఆయన ఏర్పాటు చేసుకున్నారు  అనుక్షణం వారి నామ కీర్తన తప్ప మరొక పని ఆయనకు లేదు. రాజుగారు తన ఇంటిని ఆసుపత్రిగా మార్చి  దానికి అనుకూలంగా ఏర్పాటు చేశారు  స్త్రీలైనా పురుషులైన రావడానికి ఒక మార్గం వెళ్లేటప్పుడు మరొక మార్గం  ఉంటుంది  ఒక రోజు నేను అక్కడ కూర్చుని ఉండగా  ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఒకరి వెంట ఒకరు వరుసలో వస్తున్నారు  ఫలానా రంగు చీర కట్టుకున్న ఆమెను ఆ ప్రక్కగా రమ్మని చెప్పండి  ఈ వరుసలో రావద్దు అన్నారు  ఆయన ఎందుకు  ప్రత్యేకంగా ఆ వ్యక్తిని అన్నారు అన్న విషయం నాకు ఆలోచన రాలేదు  ఎందుకు అలా చేశారు అని అడిగితే  ఆమె    బహిష్టురాలు  స్వామి ఎదురుగా రావడానికి వీలు లేదు అని చెప్పారు  వైద్యం తర్వాత ఆమె వెళ్లేటప్పుడు  అడిగితే అది నిజమేనని ఆమె చెప్పింది  నాకు స్వామి వెన్నంటే నా బాధ్యతలను నాకు అనుక్షణం గుర్తు చేస్తూ ఉంటారు అంటారు డాక్టర్ గారు. వారు తిరుపతి వెళ్ళేటప్పుడు ప్రతిసారి నేను ఉండి తీరవలసినదే  నాతోపాటు మరి కొంతమంది ఆత్మీయ స్నేహితులు ఉంటారో వారందరూ వస్తారు ఆయనతో వెళ్లడం వల్ల  నేరుగా స్వామి వారి దర్శనం చేసుకోవద్దు  వారికి ఆ వెసులు బాటు ఉంది  దర్శనం అయిన తర్వాత ఆ ప్రదేశంలో చూడవలసిన  వాటిని అన్నిటినీ చూపుతూ దాని చరిత్ర మొత్తాన్ని మాకు తెలియజేస్తూ ఉంటారు  అక్కడ గైడ్స్ కు కూడా తెలియని అనేక రహస్యమైన విషయాలు కూడా మాకు తెలియజేస్తూ ఉంటారు.  స్వామివారి దర్శనం ఎంత ప్రధానమో ఈ విషయాలను తెలుసుకోవడం  అంత ప్రధానం అని నా ఉద్దేశం  స్థల పురాణాన్ని గురించి తెలియక పోయినట్లయితే ఆ స్వామిని చూసిన ఆ ప్రాంతం ప్రకృతి సౌందర్యం చూసినా నీకు ఏ విధమైన ప్రయోజనం ఉండదు అనుకునే వారిలో నేను కూడా ఒకడిని  అందుకే ఎప్పుడూ వారి వెంట వెళ్లడం.

కామెంట్‌లు