బ్రతుకు సేద్యం ;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
ఎన్నికష్టసుఖాల్నినాన్న--+
తన భుజాలపై మోసాడో?
వంగిన విల్లు మానాన్న
దేహం

తనకు తిండి మీద ధ్యాసే లేదు?!
రేపటి పనిపాటపైనే
తన దృష్టంతా!?
అతని తనువుకు విరామం లేదు.
తానొక యంత్రం

బాధను దిగమ్రింగడం తప్పా!?
ఎవరితో ఏకరువు పెట్టగలడు.
శ్రమజీవనమే నిత్య బ్రతుకు (స్వేదం) సేద్యం .

వయస్సుడిగినా
ఆశచావనితనం
అదుపులేని కెరటమే మానాన్న
ఒడ్డుకుచేరని
ఒంటరి నావే మానాన్న


కామెంట్‌లు