విజ్ఞుల మౌనం శ్రేయస్కరంకాదు?!;- అంకాల సోమయ్యదేవరుప్పుల జనగామ9640748497
పోటాపోటీ పార్టీ బహిరంగ సభలు
ఉచిత సంక్షేమ పథకాలంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు

అరచేతిలో వైకుంఠం చూపే అవకాశవాద రాజకీయాలు

ఓటరు తమ హామీల గాలానికి
 చిక్కాలని
వారి  టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యాప్రదర్శనలెన్నో


 రాజకీయమే నాయకుల లాభసాటి వ్యాపారం!?
ప్రజా ధన దుర్వినియోగం
 ఈ వ్యాపార లక్షణం2

నోటు కు నాటుకు తలొగ్గితే

అభివృద్ధి అధఃపాతాళం

 విజ్ఞుల మౌనం విశ్వవినాశనంనకు
సాక్షి భూతం---2

కాలం మీద తోసే 
ప్రతి సవాలుకు జవాబు
దొరకదుగా--2

నిన్ను (మిమ్మల్ని మీరే) నువ్వే సంస్కరించుకో---
నీ(మీ)సవాలుకు జవాబు( వెతకాలి) వెతుక్కో2



కామెంట్‌లు