ఆశలగాలం;- అంకాల సోమయ్య -దేవరుప్పుల- జనగామ-9640748497
ఉచిత పథకాలు ఆశజూపి
ఓటరు ఓటుబ్యాంకు కొల్లగొట్టి
అధికార పీఠం అధిరోహించి
దోపిడి గీతం ఆలపిస్తుంటే
ఇంకా సోయి మరిచి ఓటర్లు
అభ్యర్థుల ప్రలోభాలకు ఆశపడి
పాశుపతాస్త్రం లాంటి ఓటును
100,కో1000కో అమ్ముకోవడం
అంటే మన అభివృద్ధిని మనమే అడ్డుకోవడం కాదా!?

ఆకలి, పనిలేనితనం, మనిషిని
ఉచితానుచితంకాని పనులను
చేసేలా పురిగొల్పుతుంది

ఈ వ్యవస్థ మారాలి, మార్చాలి 
ఇకనైనా మారు(దాం)ద్దాం
ఉత్తమ అభ్యర్థికే మన ఓటు

మన విద్యుక్త ధర్మాన్ని
 మనం తూచతప్పకుండా నిర్వహిద్దాం


కామెంట్‌లు