రాజకీయ వ్యాపారం;- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగామ-9640748497
ఇప్పుడు రాజకీయమంతా
లాభసాటి వ్యాపారమే

నీతి నియమాలు లేవు
వ్యక్తిగత స్వార్థం తప్పా

ఎన్నికల వేళ ఎన్నెన్ని లీలలో
ఎన్నికల ముగిశాక
కంటికి కనబడని ప్రభువులు
నియోజకవర్గ పరిధికోసమైఖర్చుచేసే 
అభివృద్ధి నిధుల్ని పందికొక్కులా మెక్కే
పచ్చిమోసకారులు


పాతపనులకు కొత్త పర్మీషన్లుతెచ్చుకొని
ప్రజాధనాన్ని దోపిడి చేసే కుట్రలు కుతంత్రాలు

ఎదిరించి అడిగితే తప్పుడుకేసులు బనాయించి
జైల్లో తోయడం

పోలీసు యంత్రాంగం
 తమకనుసన్నలలో ఉన్నారన్న
అహంభావం అన్నివ్వవస్థల్ని
అవినీతిన ముంచిన వైనం

ఓటరు నోటుకు నాటుకు తలొగ్గినంతకాలం
ఈ వ్యవస్థ బాగుచేయడం
ఆ బ్రహ్మతరము కూడాకాదు

ఓటర్లు చైతన్యవంతులు కావాలి
ప్రజాస్వామ్యమంటే
ప్రజలచేత ప్రజలకొరకు ఏర్పడిన
 వ్యవస్థ అని ప్రతి పౌరుడు గుర్తెరగాలి

అప్పటికిగాని ఎగుడుసమాజం
సమతలంకాదు
ఆదిశగా యువతరం నడుంబిగించాలి
కామెంట్‌లు