అక్షరాల ఉవాచ;- -గద్వాల సోమన్న,9966414580
ఉబుకుచుండు ఊటలా
సొగసులీను తోటలా
నలుగురికి సాయపడుదాం!
గమ్యం చేర్చు బాటలా

వెలుగునిచ్చు భానునిలా
వెన్నెలనిచ్చు జాబిలిలా
ఆదర్శం చూపుదాం!
వెన్నలాంటి మనసులా

ఫలాలిచ్చు తరువులా
జలములిచ్చు చెరువులా
ఉపకారం చేసేద్దాం!
విద్య నేర్పు గురువులా

కడుపు నింపు తల్లిలా
తావులీను మల్లెలా
అందరికి ఉపకరిద్దాం!
అమ్మ వంటి పల్లెలా

కామెంట్‌లు