గురువు శిష్యుడు- కె. ఉషశ్రీ-: 9వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీర్మాల.-మండలం: దేవరుప్పుల-జిల్లా: జనగాం
 అనగనగా ఒక గ్రామంలో ఒక గురువు, ఒక శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యునికి తల్లిదండ్రులు చిన్నగా ఉన్నప్పుడే మరణించారు. ఆ శిష్యుని పేరు రాజేష్ అతడు వాళ్ళ గురువుతోనే ఉంటాడు. అతని ఆలన పాలన అంత వాళ్ల గురువు చూసుకునేవాడు అతనిని తనతో బడికి తీసుకపోయేవాడు. చదువు చెపుతాడు మరియు రాజేష్ అవసరాలకు డబ్బులు కూడా ఇచ్చి బట్టలు పుస్తకాలు కొనిచ్చేవాడు. గురువు ఎప్పుడు తన కన్నా కొడుకు లాగానే రాజేష్ ను చూసుకునేవాడు. కొన్ని సంవత్సరాలకు చదువు పూర్తి అయ్యింది. రాజేష్ గురువు సహాయంతో బాగా చదువుకున్నాడు. రాజేష్ కు చదవడం తన కోరిక. రాజేష్ చదివి ఒక మంచి కలెక్టర్ అయ్యాడు. గురువు దగ్గరికి వచ్చి రాజేష్ ఏడ్చాడు. సార్ మీరు లేకపోతే నేను ఇలాంటి పెద్ద స్థాయికి వచ్చేవానే కాదు అని గురువుకి చెప్తాడు. గురువు నా విద్యార్థి కలెక్టర్ అయ్యాడు అని సంతోషంగా అంటాడు. ఇక రెండు సంవత్సరాలకు మంచిగా గురువు రాజేష్ కు పెండ్లి చేశాడు. రాజేష్ తన భార్య రవళితో సంతోషంగా జీవించసాగాడు. రాజేష్ తను కలెక్టర్ గా అయినా తరువాత తాను చదువుకున్న ఊరిని బాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. తను చేస్తున్న కలెక్టర్ జాబు వృత్తికి న్యాయం చేస్తూ ప్రజలను ప్రజలతో జీవించసాగాడు.
నీతి: గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువులు మన ఆలన పాలన కూడా చూసుకుంటారు. గురువులు చదువుకోవాలన్న వారికి దగ్గరుండి చదువు చెప్పుతారు గురువు అంటే తల్లి తండ్రి తరువాత గురువే మనకు దైవం. మన జీవితాన్ని తీర్చిదిద్దేది గురువే.
కామెంట్‌లు